కడప జిల్లా వల్లూరు మండలం అంబవరం ఎస్సీ కాలనీలో దారుణం జరిగింది. భార్యను కట్టుకున్న భర్తే (Murder)చంపేశాడు. ఆమెను విచక్షణ రహితంగా కత్తితో నరికాడు భర్త యర్రగుడి పాడు చెన్నకేశవ. దీంతో భార్య సుజాత అక్కడికక్కడే మృతి చెందింది.
- Advertisement -
గత రెండు రోజుల నుండి భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతున్నట్లు స్థానికులు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న కమలాపురం సిఐ ఎస్.కె రోషన్ వివరాలను సేకరిస్తున్నారు. భార్యను చంపిన భర్త ఎర్రగుడిపాడు చెన్నకేశవ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.
ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.