ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా బాలల అదాలత్ లను అక్టోబర్ నుండి నిర్వహించనున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు, సభ్యులు జంగం రాజేంద్ర ప్రసాద్, గోండు సీతారాం, బత్తుల పద్మావతి తెలిపారు. మంగళగిరి కార్యాలయంలో బాల అదాలత్ లను అక్టోబర్ లో తిరుపతి, విజయవాడ-విశాఖపట్నంలో నిర్వహించడానికి ప్రణాళికలు, సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
18 సం.లోపు బాలలు తమ హక్కులకు భంగం వాటిల్లినపుడు, ఆయా ప్రాంతాల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని కమిషన్ దృష్టికి తీసుకొని రావడానికి మంచి సువర్ణ అవకాశం కల్పిస్తుందని వీరు తెలిపారు. బాలలతో, బాలల కోసం పనిచేస్తున్న అధికారులు అందరినీ భాగస్వామ్యం చేస్తూ బాలల సమస్యలు ఆకడికక్కడే పరిష్కరించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ముఖ్యంగా బాలలకు రక్షణ, సంరక్షణ , అభివృద్ధి,విద్య, వసతి, లైంగిక వేధింపులు, మౌళిక సదుపాయాల, రవాణా, కుల, మత వివక్ష, శారీరక దండన వంటి బాలల హక్కుల పరిరక్షణ కోసం బాలల అదాలత్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సెక్రెటరీ టీ వీ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.