Sunday, October 6, 2024
Homeనేరాలు-ఘోరాలుBanaganapalli: వేడుకకు వచ్చి విషాదంలో మునిగిన కుటుంబం

Banaganapalli: వేడుకకు వచ్చి విషాదంలో మునిగిన కుటుంబం

బనగానపల్లె నియోజకవర్గం అవుకు మండలంలో.తమ బంధువుల ఇంటికి వివాహ వేడుకకు వచ్చి ఆ వివాహ వేడుకకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని, కొంత ఆటవిడుపు కోసం సమీపంలోని అవుకు జలాశయంకు వెళ్లి బోటులో విహారయాత్ర చేస్తుండగా బోటులోకి నీరు చేరడంతో పడవ బోల్తాపడి తమ కుటుంబంలోని ముగ్గురు సభ్యులను కోల్పోయిన విషాద సంఘటన కోయిలకుంట్ల ఎస్బిహెచ్ కానిస్టేబుల్ రసూల్ ఇంట చోటు చేసుకుంది.
ఈసంఘటన వారి కుటుంబంలోనే కాకుండా ఈ ప్రాంతంలోని ప్రతి ఒక్కరిని కలిచి వేసింది. వివరాల్లోకి వెళితే కోవెలకుంట్ల ఎస్బి హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రసూల్ భాషా తన కుటుంబంతో అవుకు మండలంలోని చెన్నంపల్లిలో జరుగుతున్న తమ దగ్గరి బంధువుల వివాహ వేడుకకు హాజరయ్యారు. అయితే వివాహ వేడుకల్లో కొంత విరామం దొరకడంతో 13 మంది కుటుంబ సభ్యులు కలిసి సమీపంలోని అవుకు రిజర్వాయర్ చూడాలని ప్రయాణమయ్యారు. అయితే అక్కడ జలాశయంలో బోటింగ్ సౌకర్యం ఉండడంతో జలాశయంలో బోటింగ్ చేయాలని సరదాపడ్డారు. అనుకున్నదే తడవు పడవ మాట్లాడుకుని బోటింగ్కు వెళ్లారు. అయితే ఆ బోటింగ్ వారి కుటుంబంలో తీవ్ర విషాదం నింపుతుందని వారు ఏ మాత్రం ఊహించ లేదు. బోటు కొద్ది దూరంగా వెళ్లగానే అందులోకి నీరు చేరుతున్న విషయాన్ని బోటింగ్ డ్రైవర్ గమనించాడు. దీంతో అతను గాబరాకు గురై పడవ మునిగిపోతుందన్న భయంతో తాను నీళ్లలోకి దూకేసాడు. ఈలోపు బోటులో ఉన్న రసూల్ కుటుంబం సైతం ఈ సంఘటనలతో తాము భయాందోళనకు గురై, వారు కూడా బోటు నుంచి కిందికి దూకే ప్రయత్నం చేశారు. కొందరు బోటులో ఉన్న లైఫ్ జాకెట్లను వేసుకోని నోటిలోకి దుకగా మరికొందరు ప్రాణభయంతో తీవ్ర హాహాకారాలు చేస్తూ, బోల్తాపడ్డ బోటుపై ఉండిపోయారు. అయితే ఈ లోగా ఒడ్డున ఉన్నవారు వారి కేకలను వినడం వారి రక్షణార్థం మరో బొటులో ప్రమాదం జరిగిన సంఘటన ప్రాంతం వద్దకు వెళ్లి, రక్షణ చర్యలు చేపట్టి కొందరిని ఒడ్డుకు చేర్చారు. ఈలోగా నీటిలో మునిగిన ఆశాబి నీటమునిగి చనిపోగా మరో ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని బనగానపల్లె ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో ఈ సంఘటనలో ఒకే కుటుంబానికి 13 మందిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా తొమ్మిది మంది ఎలాగోలా ప్రాణాలను దక్కించుకున్నారు. ఈ సంఘటనలో హెడ్ కానిస్టేబుల్ రసూల్ తన కుమార్తెను కోల్పోగా ఆయన సోదరుని కుమార్తె,మరొక కుటుంబ సభ్యురాలు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది . అయితే ఈ సంఘటనలో బోటింగ్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమైందని ఆరోపణలు వస్తున్నాయి డీఎస్పీ శ్రీనివాసరెడ్డి మరియు కోవెలకుంట సర్కిల్ ఇన్స్పెక్టర్ నారాయణ రెడ్డి అవుకు ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి కలిసి టూరిస్ట్ బోటు ను పరిశీలించారు మృతి చెందిన కుటుంబ సభ్యులకు పరామర్శించి వారికి మనోధైర్యం కల్పించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News