Sunday, July 7, 2024
Homeనేరాలు-ఘోరాలుBasheerabad: బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో దారుణం

Basheerabad: బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో దారుణం

పీఎస్ కి పిలిపించి చితకబాదిన హెడ్ కానిస్టేబుల్

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఒక కార్మికుని చావబాదాడు హెడ్ కానిస్టేబుల్. బషీరాబాద్ మండల కేంద్రంలో మంగళవారం బాధితుడు వడ్డే నగేష్ ను హెడ్ కానిస్టేబుల్ తీవ్రంగా కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయాడు, వెంటనే తాండూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా బాధితుడిని డాక్టర్స్ మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. తెలంగాణ ప్రభుత్వము ఏర్పడినంక ఫ్రెండ్లీ పోలీసు అన్నారు. కానీ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఏ చిన్న కేసు ఆయన ఫిర్యాదుకు అని వచ్చిన పిలిపించి కొట్టడం డబ్బులు వసూలు చేయడం జరుగుతుందని బాధితుడి కుటుంబ సభ్యులు చెప్పుకొస్తున్నారు. బషీరాబాద్ కొలఫారం సమీపంలో ఉండే అనసూయ భర్త నర్సప్ప దగ్గర రూ.30 వేల అప్పును వడ్డే నగేష్ తీసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెడ్ కానిస్టేబుల్ వడ్డే నగేష్ ను స్టేషన్ కి పిలిపించి చితకబాధడు. బాధితుడి కుటుంబ సభ్యులు హెడ్ కానిస్టేబుల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని పేర్కొన్నారు. లేదంటే ఉన్నత అధికారులకు పిర్యాదు చేస్తామని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News