సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని బాలనగర్ జోన్ లోని అన్ని పోలీస్ స్టేషన్‌ల అధికారులతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సమావేశం నిర్వహించారు. బాలానగర్ జోన్ లోని అన్ని పోలీస్ స్టేషన్లలో నేరాల సంఖ్యను 2023లో తగ్గించే విధంగా పోలీస్ సిబ్బంది కృషి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో సెక్టార్ ఎస్ఐలది కీలకపాత్ర కనుక..నేరాలను తగ్గించేందుకు సెక్టార్ ఎస్సైలు సరికొత్త స్ట్రాటజీలతో ముందుకు వెళ్లాలన్నారు. పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ షీట్స్ ద్వారా ఎప్పటికప్పుడు సెక్టార్ ఎస్సైల పనితీరును అంచనా వేస్తామన్నారు రవీంద్ర. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 5H, 5W, TIP వంటి పద్ధతు లతో ఇన్వెస్టిగేషన్లో నాణ్యతను పెంచాలన్నారు. ప్రతివారం లా అండ్ ఆర్డర్ పై ఇన్స్పెక్టర్లు సమీక్షలు చేయాలన్నారు. ముఖ్యంగా పోలీసులు వారి ప్రాథమిక విధుల పైన దృష్టి సారించాలన్నారు. సెక్టార్ ఎస్ఐల పనితీరుపై తానే స్వయంగా దృష్టి సారిస్తానని స్టీఫెన్ రవీంద్ర అన్నారు.
Cyberabad: బేసిక్ పోలీసింగ్ పై దృష్టి సారించండి: స్టీఫెన్ రవీంద్ర
- Advertisement -
సంబంధిత వార్తలు | RELATED ARTICLES