Monday, March 24, 2025
Homeనేరాలు-ఘోరాలుBetting Apps: బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేసిన అగ్ర హీరోలపై ఫిర్యాదు

Betting Apps: బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేసిన అగ్ర హీరోలపై ఫిర్యాదు

యువతను బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్స్‌(Betting Apps)పై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఈ యాప్స్ ప్రమోట్ చేస్తూ యువతను బెట్టింగ్ ఊబిలోకి లాగుతున్న సోషల్ మీడియా సెలబ్రెటీలపై కేసు నమోదు చేస్తున్నారు. ఇందులో భాగంగా 11 మంది సెలబ్రెటీలపై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు అగ్ర హీరోలపై ఫిర్యాదు చేశారు. హీరోలు ప్రభాస్, గోపీచంద్‍పై అన్‌లైన్ ద్వారా సిటీ పోలీసులకు ఫిర్యాదు చేసిన రామారావు. FUN88 బెట్టింగ్ యాప్కి బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ ప్రమోషన్ చేశారు – హీరోల ప్రమోషన్‍తో చాలామంది డబ్బులు నష్టపోయారని ఫిర్యాదు చేశారు.

ఈ కేసులో మరికొందరికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల, హర్షసాయి, సన్నీ యాదవ్, సురేఖవాణి కుమార్తె సుప్రీత, రీతూ చౌదరి, ప్రియాంక జైన్ సహా పలువురిపై కేసు నమోదైంది. ఈ బెట్టింగ్ యాప్స్‌ ఆగడాలపై ముఖ్యంగా ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్(Sajjanar), ప్రపంచ యాత్రికుడు అన్వేష్ పోరాటం ప్రశంసనీయమైంది.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News