Sunday, July 7, 2024
Homeనేరాలు-ఘోరాలుBhimadevarapalli: ‘సహారా’ డిపాజిట్లు బాధితులకు అందేనా..?

Bhimadevarapalli: ‘సహారా’ డిపాజిట్లు బాధితులకు అందేనా..?

మెచ్యూరిటీ తీరినా చేతికి అందని డబ్బు

హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలము ముల్కనూర్ గ్రామంలో ‘సహారా’ డిపాజిట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. సహారా బ్యాంకు పేరిట సేకరించిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గడువు తీరినా సొమ్ము చెల్లించకపోతుండటంతో డిపాజిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సహారా ఏజెంట్లను నిలదీస్తున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇల్లు, స్థలాల కొనుగోలు, కుటుంబ అవసరాల కోసం డబ్బులు దాచుకున్నామని.. ఇప్పుడు సొమ్ము రాక నానా అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. సంస్థలో పలు ఆర్థిక సమస్యల కారణంగా చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయని, సొమ్ము వస్తుందని ఏజెంట్లు పైకి సర్ది చెప్తున్నా.. లోపల వారు కూడా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.

- Advertisement -

ఐదున్నరేళ్లలో సొమ్ము రెట్టింపు అవుతుందని చెప్పడంతో చాలామంది తమ కష్టార్జితాన్ని సహారాలో డిపాజిట్‌ చేశారు. కొందరు ఒకేసారి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డీ) చేస్తే.. చాలా మంది వారానికోసారి, నెలకోసారి కట్టే రికరింగ్‌ డిపాజిట్లు (ఆర్‌డీ)గా పొదుపు చేశారు. వీరిలో చాలా వరకు కూలీలు, పేదలే. చివరిలో పెద్దమొత్తంలో సొమ్ము చేతికి అందుతుందని ఆశపడ్డవారే. సహారా సంస్థ ఏజెంట్లు గ్రామాల్లో పర్యటిస్తూ.. తమకున్న పరిచయాలతో డిపాజిట్లు సేకరిస్తున్నారు. కొన్ని రోజుల నుండి ఏజెంట్లు, బాధితులు తరచూ సహారా కార్యాలయానికి వస్తూ బ్రాంచ్ మేనేజర్ తో సంప్రదింపులు జరుగుపుతున్నారు. ఐనప్పటికీ మెచ్యూరిటీ తీరిన కూడ కస్టమర్స్ కి డబ్బులు ఇవ్వడం లేదని తెలుస్తుంది.

ఆఫీస్ కి వచ్చి గొడవ చేసే వారిని బుజ్జగించి రెండు చేతులతో దండం పెట్టీ కొంత కొంత అమౌంట్ ఇచ్చి సర్ది చెపుతున్నారు. ఫిక్స్ డిపాజిట్ చేసి మెచ్యూరిటీ పూర్తీ గానీ కస్టమర్స్ కనీసం కట్టిన డబ్బులు ఐనా తిరిగి ఇస్తారో లేదో అనీ ఆందోళనా చెందుతున్నారు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News