తిరుపతి జిల్లా నాయుడుపేటలో దారుణం చోటుచేసుకుంది. తమ్ముడు చేతిలో అన్న దారుణంగా హత్య(Murder)కు గురయ్యాడు. నాయుడుపేట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాపులూరు దరకాస్తు కండ్రికలో జరిగిన ఘటనతో ప్రజలతో ఉలిక్కిపడ్డారు.
- Advertisement -
శుక్రవారం రాత్రి అన్నదమ్ముల మధ్య చిన్నపాటి ఘర్షణతో మొదలై హత్యకు దారి తీసిన వైనం. వెంకట రమణయ్యను కత్తితో హత్య చేశాడు తమ్ముడు బాబు. మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. మృతుడి భార్య చంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్ సీఐ బాబి తెలిపారు.