అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం లోతేరు పంచాయతీ డుంబ్రిగూడలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. చేతబడి చేస్తున్నాడన్న నెపంతో అడారి డొంబురు అనే వ్యక్తిని గ్రామస్తులు పెట్రోల్ పోసి సజీవ దహనం (Burn man alive) చేసి తగులబెట్టారు. ఈ సంఘటన అరకులోయ నియోజకవర్గంలో సంచలనం సృష్టించింది.
అరకులోయ మండలం లోతేరు పంచాయతీ డుంబ్రి గుడ గ్రామానికి చెందిన అడారి డొంబురు (60) అనే వ్యక్తి గ్రామంలో చిల్లంగి, చేతబడి చేస్తున్నాడన్న నెపంతో గ్రామస్తులంతా కలిసి డొంబురును ముందుగా కర్ర, రాయితో కొట్టి ఆ తర్వాత పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. డుంబ్రిగుడ గ్రామంలో సుమారు 15 కుటుంబాలు నివసిస్తున్నాయి . అయితే కొద్దిరోజులుగా డొంబురు కుటుంబం తమకంట ఆర్థికంగా ఎదుగుతుందని, డొంబురు వలనే తాము ఇబ్బందులు పడుతున్నామన్న అక్కుసతో గ్రామస్తులు ఈ ఘటనకు పాల్పడ్డారు.
సజీవ దహనం సంఘటన తెలుసుకున్న పాడేరు డి.ఎస్.పి షేక్ షహబజ్ అహ్మద్ తమ సిబ్బందితో డుంబ్రిగూడ గ్రామానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే క్లూస్ టీం ఆ గ్రామానికి చేరుకుని ఆధారాలు సేకరించింది