Monday, March 10, 2025
Homeనేరాలు-ఘోరాలుAccident: ప్రమాదవశాత్తు కాలువలో పడిన కారు..తండ్రి, కూతురు గల్లంతు.. కొడుకు మృతి

Accident: ప్రమాదవశాత్తు కాలువలో పడిన కారు..తండ్రి, కూతురు గల్లంతు.. కొడుకు మృతి

వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కాలువలో కారు పడిపోయింది. ఈ ప్రమాదంలో తండ్రి కూతురు గల్లంతయ్యారు. కొడుకు మృతి చెందారు. తల్లిని గ్రామస్తులు కాపాడారు.

- Advertisement -

వరంగల్ జిల్లా ఇనుగుర్తి మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన సోమారపు ప్రవీణ్ కుటుంబంతో సహా కారులో ప్రయాణిస్తుండగా, సంగెం మండలం తీగరాజుపల్లి సమీపంలోని ఎస్సారెస్పీ కాలువలో వారి కారు ప్రమాదవశాత్తు పడిపోయింది

ప్రవీణ్ భార్య కృష్ణవేణిని గ్రామస్తులు కాపాడగా కొడుకు అప్పటికే మృతి చెందాడు, కాలువలో గల్లంతైన తండ్రి కూతురు కోసం స్థానికులు గాలిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు వేగవంతం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News