Saturday, November 23, 2024
Homeనేరాలు-ఘోరాలుChagalamarri: స్మశాన స్థలం చూపించాలని శవంతో ధర్నా

Chagalamarri: స్మశాన స్థలం చూపించాలని శవంతో ధర్నా

ఎట్టకేలకు స్పందించిన అధికారి, సమస్య పరిష్కారం

మండలంలోని తోడేళ్లపల్లె గ్రామ ఎస్సీ కాలనీ దళితుల స్మశాన స్థలానికి పరిష్కారం లభించింది. గురువారం తహసిల్దార్ సుభద్రమ్మ, మండల సర్వేర్ మద్దిలేటి, గ్రామ రెవెన్యూ అధికారి గ్రామానికి వెళ్లి మృతదేహాన్ని పూడ్చి పెట్టకుండా అడ్డుకున్న వ్యక్తితో చర్చించి రెవెన్యూ అధికారులచే ఏర్పాటు చేసిన హద్దుల రాళ్లు, ఆ స్థలం నుండి తీసివేయవద్దని అట్లు తీసివేసిన ఎడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మృతదేహంతో ధర్నాకు కూర్చున్న దళితుల వద్దకు తహసీల్దారు వచ్చి స్మశాన స్థల వివాదం పరిష్కరించామని, మృతదేహాన్ని తీసుకువెళ్లాలని చెప్పినప్పటికీ, మృతదేహాన్ని తీసుకువెళ్లకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి ఎస్సై రమణయ్య ఆధ్వర్యంలో చర్చించడం జరిగింది. గ్రామస్తులు కోరిన విధంగా తిరిగి రీ సర్వే నిర్వహించి స్మశానానికి హద్దులు చూపించి సర్వే రాళ్లను కూడా ఏర్పాటు చేస్తామని తహసీల్దారు తెలియజేశారు. అవసరమైతే పోలీసు రక్షణతో సర్వే నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ధర్నా విరమించి మృతదేహాన్ని స్మశాన స్థలానికి తీసుకువెళ్లారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News