Saturday, November 23, 2024
Homeనేరాలు-ఘోరాలుChevella: నిద్ర మత్తులో నిఘా నేత్రాలు !

Chevella: నిద్ర మత్తులో నిఘా నేత్రాలు !

భద్రత వ్యవస్థ పోలీస్ యంత్రాంగం విషయంలో మనరాష్ట్రం దేశంలోనే నంబర్ 1 అని నిత్యం గొప్పలు చెబుతున్నారు ముఖ్య నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పటిష్టమైన పకడ్బంధి పోలీస్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థ. నేరాలను గంటల వ్యవధిలోనే చేదించే డేగ కల్ల లాంటి నిఘా నేత్రాలు దేశంతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో 69 శాతం ఉండడం గర్వకారణమంటున్నారు నేతలు. అధికారులు కూడా ఒక్క సిసి కెమెరా 100 మంది పోలీసులతో సమానమనం అంటున్నారు. వాస్తవానికి ఈ సిసి కెమెరాల ద్వారా ఎన్నో కేసులను గంటల వ్యవధిలోని చేధించిన సందర్భాలు లెక్కలేనన్ని ఉన్నాయి.

- Advertisement -

చేవెళ్ల నియోజకవర్గంలో రక్షణ కోసం ఏర్పాటు చేసిన కెమెరాలలో మాత్రం ఈ ప్రాంతం కనబడదు. ఈ పట్టణంలో మూడు కెమెరాలు మాత్రమే పని చేస్తుండటం అసలు విషయం. చిరు వ్యాపారులు స్వచ్ఛందంగా ఇచ్చిన డబ్బుతో గతంలో పోలీసులు నిఘా నేత్రాలను ఏర్పాటు చేశారు. గత కొన్ని నెలలుగా మూడే పని చేస్తున్నాయంటే వినడానికి విడ్డూరంగా ఉంది.ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ వ్యాపారంతో గ్రామపంచాయతీ హెచ్ఎండిఏ వెంచర్లతో నిండుకుండలా ఉంది. ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారులు రక్షణ వ్యవస్థకు సహకరిస్తే తప్పేంటి అంటున్నారు ప్రజలు. మరి పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయం పట్ల దృష్టి ఎందుకు పెట్టడంలేదనేది ప్రజలు అడుగుతున్న ప్రశ్న. క్లిష్టమైన కేసుల దర్యాప్తులో సీసీ కెమెరాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇంతటి సీసీ కెమెరాల పనితనంపై పర్యవేక్షణ పట్టింపు లేకపోవడం పోలీసుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని స్థానికులు భగ్గుమంటున్నారు.

దినదినాభివృద్ధి చెందుతున్న చేవెళ్ల నగరంలో నిఘా నేత్రాలు నిద్రపోవటమంటే నేరస్థులు సులువుగా తప్పించుకునే అవకాశం కల్పించినట్టే. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీటిని రిపేరు చేయిస్తే భద్రతా ప్రమాణాలు ఇక్కడ మరింత మెరుగుపడతాయనేది చేవెళ్ల వాసుల అభిప్రాయం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News