చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల్ సంకేపల్లి గూడ గ్రామంలో హృదయ విదారకమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ హత్యకు సంబంధించి చేవెళ్ల ఏసీపి కార్యాలయంలో గురువారం ఏసిపి పి ప్రశాంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏసిపి తెలిపిన వివరాల ప్రకారం… షాబాద్ మండలం హైతాబాద్ చెరువులో సెప్టెంబర్ 4 సోమవారం బోర్ల పడి ఉన్న శవాన్ని స్థానికులు ఇచ్చిన సమాచారంతో గుర్తించామన్నారు. సంకేపల్లి గూడ సర్పంచ్ గ్రామస్తుల సహాయంతో డెడ్ బాడీని బయటికి తీశామన్నారు. శవం ఆనవాళ్ళు పరిశీలించగా షాబాద్ మండలం సంకేపల్లి గూడ గ్రామం కుమ్మరి ప్రవీణ్ తండ్రి విట్టలయ్య వయసు 31 సంవత్సరాలు వృత్తి డ్రైవర్ కం ఓనర్. ఈ కేసులో పోలీసులు విచారణలో కుమ్మరి ప్రవీణ్ అదే గ్రామానికి చెందిన కుమ్మరి మమత భర్త సుధాకర్ 22 సంవత్సరాల వివాహితతో అక్రమ సంబంధం ఉందని తేల్చారు. గత కొంతకాలంగా సాగుతున్న ఇరువురి సంబంధం కుటుంబ సభ్యుల నుంచి గ్రామ పెద్దల వరకు వెళ్లిందని గ్రామస్తులు ఇది సరైన పద్ధతి కాదని చెప్పినా వినలేరన్నారు. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో మమత ప్రశాంత్ ల మధ్య విభేదాలు వచ్చాయని తెలిపారు. ప్రశాంత్ సెప్టెంబర్ 1శుక్రవారం రాత్రి 10 గంటలకు హౌస్ టెర్రస్ పైనుంచి మమతతో ఫోన్లో మాట్లాడారని మమత తమ ఇంట్లోకి రమ్మని కోరగా జరిగిన గొడవ దృశ్య ఇంట్లో మీ అత్త మామ ఉన్నారని తనను ఏమైనా చేస్తారని కూడా ప్రశాంత్ అనుమానం వ్యక్తం చేసి మమతనే తమ ఇంటి టెర్రస్ పైకి రమ్మని కోరాడని తెలిపారు. తమ అత్త మామ పడుకున్నారని పడుకొని ఉన్న వారి ఫోటో తీసి మమత ప్రశాంత్ కు పంపి నమ్మిచ్చింది. పక్కా పథకంతో ఉన్న మమత అత్త మమల్ని నిద్రపోతున్నట్టు నటించారని పెద్దవీడు గ్రామంలో ఉన్న మమత సోదరుడు కుమ్మరి కుమార్ తండ్రి నారాయణ వయసు 26 సంవత్సరాలు అప్పటికే ఫోన్ చేసి పిలిపించిందని వీరందరూ ఇంట్లోనే ప్రశాంత్ కోసం కాపు కాస్తున్నారని వెల్లడించారు. ఇది నమ్మిన ప్రశాంత్ మమత ఇంట్లోకి వెళ్ళగా… ఇంట్లో గొడవ జరుగుతున్న సమయంలో మమత పథకం ప్రకారం ప్రశాంత్ ను రోకలిబండతో తలపై కొట్టిందని అరుస్తున్న ప్రశాంత్ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న క్రమంలో కుటుంబ సభ్యులు నోట్లో గుడ్డలు కుక్కి అదే రోకలి బండతో విచక్షణ రహితంగా కొట్టి కుడికాలు విరగ్గొట్టారని వెల్లడించారు.
ఎవరికి అనుమానం రాకుండా అదే రాత్రి ప్రశాంత్ చేతులను వెనక్కి కట్టి గోనె సంచిలో కుక్కి ద్విచక్ర వాహనం స్కూటీ మధ్యలో వేసుకుని చెరువు వద్దకు వెళ్లారని అక్కడ శవానికి రాళ్లు కట్టి సెప్టెంబర్ 1న హైతాబాద్ చెరువులో వేశారని తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి ప్రశాంత్ కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు కూడా జాడ కోసం పట్టించుకోలేరు. మూడు రోజుల వ్యవధిలో మమత తమ ఇంటికి ఉన్న సీసీ కెమెరా లో నిక్షిప్తమైన ఆధారాలను సైతం మాయం చేసేకుట్ర పన్నింది. ఇందుకు అదే గ్రామానికి చెందిన కుమ్మరి వెంకటేష్ సహాయం తీసుకుంది. సిసి ఫుటేజ్ లో రికార్డ్ అయిన డేటాను డిలీట్ చేయలేక పోయిండు. చెరువులోనే ఉన్న ప్రశాంత్ శవం సెప్టెంబర్ 4న తేలిందని విచారణ చేపట్టిన పోలీసులు రెండు రోజుల్లో కేసిన చేదించారు. అక్రమ సంబంధం ప్రశాంత్ హత్యకు దారి తీసిన ఘటనలో షాబాద్ ఎస్సై ఎం.మహేశ్వర్ రెడ్డి సర్కిల్ సిఐ యాదయ్య గౌడ్ విచారణ అనంతరం మొత్తం 7 మందిపై కేసు నమోదు చేశారు. రెండు రోజుల వ్యవధిలోని కేసును చేదించిన షాబాద్ ఎస్సై సిఐని చేవెళ్ల ఏసిపి పి. ప్రశాంత్ రెడ్డి అభినందించారు.