Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుChhattisgarh Tragedy: అల్లుడొచ్చాడని పార్టీ... అత్త - అల్లుడు మృతి!

Chhattisgarh Tragedy: అల్లుడొచ్చాడని పార్టీ… అత్త – అల్లుడు మృతి!

Chhattisgarh Food Poisoning Incident: అల్లుడొచ్చాడన్న ఆనందం ఆ ఇంట ఎక్కువసేపు నిలవలేదు. సంతోషంతో ఏర్పాటు చేసుకున్న విందు, ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. బంధుమిత్రులతో సందడిగా మారాల్సిన ఆ ప్రాంగణం, ఆర్తనాదాలతో నిండిపోయింది. విందులో ఆప్యాయంగా వడ్డించిన కోడి కూరే.. కాలయముడై కాటేసింది. క్షణాల్లోనే పరిస్థితి తలకిందులైంది. అసలు ఆ విందులో ఏం జరిగింది..? ఆనందం కాస్తా ఆర్తనాదాలుగా ఎందుకు మారింది..? వివరాల్లోకి వెళితే..

- Advertisement -

అసలేం జరిగిందంటే:

ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లా, రాజ్‌గమర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోర్కోమా గ్రామంలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. శివనగర్ చౌహాన్ పారాలో నివసించే రాజ్‌మీన్ బాయి (60) ఇంటికి గురువారం రాత్రి ఆమె కుమార్తె చమేలి, అల్లుడు దేవ్ సింగ్ వచ్చారు. అల్లుడు, కూతురు రావడంతో ఆ తల్లి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ సంతోషాన్ని పంచుకునేందుకు, రాజ్‌మీన్ బాయి తన కుమారుడు రాజ్‌కుమార్ మరియు ఇరుగుపొరుగు వారితో కలిసి చికెన్ పార్టీ ఏర్పాటు చేశారు. విందులో భాగంగా మద్యం కూడా సేవించినట్లు తెలుస్తోంది.

ALSO READ: https://teluguprabha.net/crime-news/husband-killed-his-wife-in-warangal-over-suspicion-of-an-extramarital-affair/

తలకిందులైన పరిస్థితి:

అందరూ కలిసి ఆనందంగా భోజనం చేసిన కొద్దిసేపటికే పరిస్థితి తలకిందులైంది. తొలుత అత్త రాజ్‌మీన్ బాయికి, ఆ తర్వాత అల్లుడు దేవ్ సింగ్‌కు తీవ్రంగా వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. ఇది చూసి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. కేవలం వారిద్దరే కాక, విందులో పాల్గొన్న మరికొందరి ఆరోగ్యం కూడా క్షీణించింది. వెంటనే బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో విషాదం:

ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే పరిస్థితి విషమించడంతో అత్త రాజ్‌మీన్ బాయి, అల్లుడు దేవ్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త తెలియగానే కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. విందులో పాల్గొన్న మరో ముగ్గురి పరిస్థితి కూడా విషమంగానే ఉందని, వారికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారని తెలిసింది.

ALSO READ: https://teluguprabha.net/crime-news/tragedy-in-miyapur-biker-dies-after-being-hit-by-school-bus/

పోలీసుల దర్యాప్తు:

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి, ఆసుపత్రికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రాథమిక దర్యాప్తులో ఇది ఫుడ్ పాయిజనింగ్ కేసు అని పోలీసులు నిర్ధారించారు. అయితే, ఈ విషాదానికి కారణం పాడైపోయిన చికెనా..? లేక విందులో సేవించిన కల్తీ మద్యమా..? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆహార పదార్థాల నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఆ నివేదికలు వచ్చిన తర్వాతే మరణానికి కచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో కోర్కోమా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad