Thursday, September 19, 2024
Homeనేరాలు-ఘోరాలుCorona Alert: 14 మంది విద్యార్థులకు నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్

Corona Alert: 14 మంది విద్యార్థులకు నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్

కరోనా వైరస్‌ ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. గార్ల మండల కేంద్రంలోని స్థానిక బి ఎస్ ఎస్ ప్రైవేటు పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. పాఠశాలలోని 18 మంది విద్యార్థులు సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వీరిలో 14 మంది విద్యార్థులు నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి అవినాష్ తెలిపారు. తొలుత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులకు జ్వరం జలుబు తగ్గకపోగా వాసన రాకపోవడంతో అనుమానం వచ్చిన పాఠశాల సిబ్బంది గార్ల కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి విద్యార్థులను తీసుకురాగా వైద్యాధికారి హనుమంతరావు కరోనా పరీక్షలు నిర్వహించారు. ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చిందని పాఠశాలలోని విద్యార్థులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు అవినాష్ కు ఆయన సమాచారం ఇచ్చారు. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు అవినాష్ తన సిబ్బందితో పాఠశాలలోని హెల్త్ క్యాంపు నిర్వహించి 60 మందికి కరోనా పరీక్షలు చేశారు.

- Advertisement -

కరోనా టెస్ట్ లు నిర్వహించిన వారిలో 14 మంది విద్యార్థులతో సహా నలుగురు సిబ్బంది కి మొత్తం 18 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం వెంటనే కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్లను పాఠశాల వసతి గృహంలోని ఐసోలేషన్ గదిలో ఉంచి మిగతా విద్యార్థులను తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి పాఠశాల నుండి ఇళ్లకు పంపించారు. ఈ విషయంపై అప్రమత్తమైన తాసిల్దార్ రాము సర్పంచ్ అజ్మీరా బన్సీలాల్ పంచాయతీ సిబ్బందిచే పాఠశాల ప్రాంగణంలో క్లోరినేషన్ చేయించారు గార్ల పట్టణంలో ఒకేసారి ప్రైవేటు పాఠశాలలో 18 మందికి కరోనా రావడంతో మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అజ్మీర బన్సీలాల్ తాసిల్దార్ రాము వైద్య సిబ్బంది డాక్టర్ అవినాష్ సూపర్వైజర్ లు ఇస్మాయిల్ శ్రీహరి ఏఎన్ఎంలు పద్మ పార్వతి ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News