Wanaparthy crime news: కోడళ్లను వేధించే అత్తల గురించి మనం వింటూనే ఉంటాం. సమాజంలో ఇది మామూలే. అయితే అత్తను కోడలు వేధిస్తూ చంపిన ఘటన ఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
నిత్యం సతాయిస్తోందని హత్య: వనపర్తి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ తన అత్తను దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన ఘటన వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని నాగపూర్ గ్రామంలో జరిగింది. ఇంట్లో నిత్యం గొణుగుతూ తనను సతాయిస్తోందంటూ వృద్ధురాలైన అత్తను ఓ కోడలు రాడ్డుతో కొట్టి హత్యచేసింది. వల్లి ఎస్సై రజిత పేర్కొన్న కథనం ప్రకారం నాగపూర్ గ్రామానికి చెందిన ఎల్లమ్మ (73), దసరయ్య దంపతులకు నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. వారిని అల్లారు ముద్దుగా పెంచి.. అందరి పెళ్లిళ్లు చేశారు. అయితే ఇటీవల ఎల్లమ్మ భర్త దసరయ్య వృద్ధప్యసమస్యలతో మృతిచెందారు. భర్త పోయాడనే పుట్టెడు దుఖంలో ఉన్న ఎల్లమ్మ.. కుమారుడు మల్లయ్య వద్ద ఉంటోంది. ఇక ఇక్కడే అసలు సమస్య తలెత్తింది.
Also Read:https://teluguprabha.net/crime-news/snow-storm-on-mount-everest/
రాడ్డుతో కొట్టి చంపిన కోడలు: అత్తా కోడలు ఒకే ఇంట్లో ఉండడంతో వారి మధ్య చిన్నచిన్న గొడవలు మొదలైయ్యాయి. దీంతో వారిద్దరు ఇంట్లో నిత్యం గొణుగుతూ ఉండేవారు. దీంతో ఎల్లమ్మను చంపాలని కోడలు నిర్ణయించుకుంది. సమయం కోసం చూసిన కోడలు ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎల్లమ్మను రాడ్డుతో కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేశారు. వెంటనే స్పందించిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని నిందితురాలిని అరెస్ట్ చేశారు. తనను ఇబ్బందులకు గురిచేస్తుండటంతో తానే చంపానని బొగురమ్మ(కోడలు) పోలీసుల ఎదుట నేరం అంగీకరించింది. ఈ ఘటనపై ఎల్లమ్మ రెండో కూతురు బచ్చమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మరింత సమాచారం దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పోలీసులు అన్నారు.


