Thursday, December 26, 2024
Homeచిత్ర ప్రభDrugs Party | డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన "ఢీ" కొరియోగ్రాఫర్

Drugs Party | డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన “ఢీ” కొరియోగ్రాఫర్

తెలుగులో బాగా పాపులర్ అయిన ఢీ షో చుట్టూనే వివాదాలు తిరుగుతున్నాయి. ఇటీవల ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్, ఢీ షో జడ్జి జానీ మాస్టర్ వేధింపుల కేసులో జైలుకి వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయం మరిచిపోకముందే… అదే షోలో కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న కన్హా మహంతి అలియాస్ కన్నా డ్రగ్స్ పార్టీ (Drugs Party) వివాదంలో ఇరుక్కోవడం హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -

మాదాపూర్‌లోని ఓయో హోటల్‌లో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ రైడ్స్ లో ప్రముఖ టీవీ షో ‘ఢీ’తో సంబంధం ఉన్న కొరియోగ్రాఫర్ కన్నా (Dhee choreographer Kanna) అరెస్టయ్యారు. ఆర్కిటెక్చర్ ప్రొఫెషనల్ ప్రియాంక రెడ్డి ఈ డ్రగ్స్ పార్టీ (Drugs Party) నిర్వహించినట్లు తెలుస్తోంది.

విశ్వసనీయ సమాచారం మేరకు, పార్టీలో డ్రగ్స్ సేవించినందుకు కన్హా, ప్రియాంకతో సహా నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎండీఎంఏ, గంజాయి తదితర డ్రగ్స్‌ను బెంగళూరు నుంచి తీసుకువచ్చినట్లు విచారణలో తేలింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.

డ్రగ్స్ నిర్మూలన కోసం సీఎం రేవంత్ రెడ్డి పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. ఈ క్రమంలో మాదక ద్రవ్యాలను సరఫరా చేసే మూలాలు , నెట్‌వర్క్‌లను గుర్తించడానికి అధికారులు తమ దర్యాప్తును విస్తరిస్తున్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడంలో పోలీసులు క్లబ్బులు, పబ్బులు, హోటల్స్, ప్రైవేట్ పార్టీలపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఓయో హోటల్ లో రైడ్స్ నిర్వహించి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News