ఈ మధ్య (Reels) రీల్స్ చూస్తూ తమ విధులనే మరిచిపోతున్నారు కొందరు. వీరి నిర్లక్ష్యం కారణంగా పలువురి ప్రాణాలను బలి కొంటున్నారు. ఇలాంటి ఘటన ఉత్తరప్రదేశ్ మైన్ పూరి జిల్లా ఆసుపత్రిలో జరిగింది.
అసలేం జరిగిందంటే..
ఈ జిల్లా ఆసుపత్రికి ప్రవేశ్ కుమారి అనే 60 ఏళ్ల వృద్ధురాలు ఛాతీ నొప్పితో(heart attack) వచ్చింది. దీంతో వారి కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. వెంటేనే వైద్యం అందించాల్సిన డాక్టర్ రీల్స్ చూసుకుంటున్నాడు.
తను రోగి వద్దకు వెళ్లి చూడాల్సింది పోయి నర్సులను పంపించి కాలక్షేపం చేస్తున్నాడు. డాక్టర్ ఆదర్శ్ సెంగార్ వద్దకు వైద్యం చేయాలని నర్సులు, రోగి తరపు బంధువులు అడిగినా పట్టించుకునే పాపాన పోలేదు. అప్పటికే నర్సులు తమ శాయశక్తుల ప్రయత్నించారు. దీంతో రోగి ప్రవేశ్ కుమారి కొన్ని నిమిషాల పాటు గుండెపోటుతో విలవిల్లాడి చివరికి ప్రాణాలు కోల్పోయింది.
చికిత్స ఎందుకు చేయలేదని ప్రశ్నించిన మహిళ కుటుంబ సభ్యులపైనే తొలుత దాడి చేసిన వైద్యుడు అనంతరం డాక్టర్ పై తిరిగి దాడి చేశారు. బాధితురాలికి సకాలంలో డాక్టర్ ఆదర్శ్ సెంగార్ వచ్చి వైద్యం అందించి ఉంటే ప్రవేశ్ కుమారి బ్రతికేదని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కేవలం వైద్యుడి నిర్లక్ష్యంగానే వృద్ధురాలు చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ డాక్టర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆసుపత్రి సీసీ టీవీ పుటేజీని పరీశీలనలోకి తీసుకున్నారు.