Thursday, December 12, 2024
Homeనేరాలు-ఘోరాలుDornakal: 80 కిలోల గంజాయి సీజ్

Dornakal: 80 కిలోల గంజాయి సీజ్

80 కిలోల ఎండు గంజాయి

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమయ గూడెం శివారులో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, నిషేధిత 80 కేజీల గంజాయిని పట్టుకున్న మరిపెడ, సీరోల్ పోలీసులు, సుమారు రూ.20 లక్షలు విలువచేసే 80 కిలోల ఎండు గంజాయి సీజ్ చేశారు.

- Advertisement -

ఆంద్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం మోతుగూడెం కు చెందిన కోర్ర నర్సింగ్, వంతల మోహన్ బాబు, వంతల సాదు అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వాహనం సీజ్ చేసిన పోలీసులు. ఆంధ్రప్రదేశ్ లోని సీలేరులో కొనుగోలు చేసి తెలంగాణా రాజధాని హైదరాబాద్ కు తరలించే క్రమంలో పురుషోత్తమాయగూడెం శివారులో అదుపులోకి తీసుకున్నారు.

మరిపెడ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించిన తొర్రూరు డిఎస్పీ కృష్ణ కిషోర్. ఈ కార్యక్రమంలో మరిపెడ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, ఎస్ ఐ లు సతీష్, సంతోష్, సిరోల్ ఎస్సై పోలీస్ యంత్రాంగం పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News