Drunk Father Sells 3 Year Old Daughter: తాగుడుకు బానిసైన ఓ కసాయి తండ్రి.. ఏకంగా మూడేళ్ల వయసున్న తన కూతురిని రూ.5 వేలకు విక్రయించి.. ఆపై కిడ్నాప్ అయిందని, తప్పిపోయిందని నాటకాలాడాడు. విజయవాడ రైల్వేస్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలు కథనంలోకి వెళ్లి తెలుసుకుందాం..
Also Read: https://teluguprabha.net/crime-news/newly-married-woman-road-accident-at-karimnagar-district/
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామన్నపేటకు చెందిన మస్తాన్, తన భార్య వెంకటేశ్వరమ్మతో తరచూ గొడవలు పడుతూ, ఎలాంటి ఉపాధి లేకుండా జీవనం కొనసాగిస్తుంటాడు. సైకిళ్ల దొంగతనంతో వచ్చిన డబ్బుతో మద్యం సేవించేవాడు. ఈ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు, ఆరుగురు అమ్మాయిలు. అయితే డబ్బుల కోసం గతంలోనే ఒక కుమార్తెను అమ్మేసిన మస్తాన్.. ఈ నెల 6న మరో అమ్మాయి శ్రావణిని తీసుకొని చీరాల నుంచి విజయవాడకు వచ్చాడు. రైల్వేస్టేషన్‌లో నే రెండు రోజుల పాటు గడిపిన అతడు… అక్కడే భిక్షాటన చేసే చిన్నారి అనే మహిళతో మజ్జిగ ప్యాకెట్లు అమ్మే శ్రీనివాసులకు తన కుమార్తె శ్రావణిని అమ్మాడు.
Also Read: https://teluguprabha.net/crime-news/tribal-welfare-enc-c-srinivas-nabbed-by-acb-at-vijayawada/
అనంతరం మస్తాన్, ఆ డబ్బుతో మద్యం సేవించి, రాత్రి 11 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఉన్న జీఆర్పీ స్టేషన్ కు వెళ్లి కుమార్తె కిడ్నాప్ అయ్యిందని ఫిర్యాదు చేశాడు. అయితే, అతని తాగిన స్థితి, సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా పోలీసులకు అనుమానం కలిగింది. జీఆర్పీ సీఐ రమణ నేతృత్వంలో గంటల వ్యవధిలోనే చిన్నారిని రాజమహేంద్రవరం బస్టాండు వద్ద గుర్తించి, చిన్నారి, శ్రీనివాసులను అదుపులోకి తీసుకున్నారు. బాలికను తల్లి వెంకటేశ్వరమ్మకు అప్పగించారు. మస్తాన్‌తోపాటు నిందితులపై కేసు నమోదు చేసి, వారిని రిమాండ్‌కు తరలించారు.


