నేరాల నియంత్రణకే కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు డిఎస్పీ ఉదయ్ రెడ్డి పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో ఎస్పీ అఖిల్ మహజాన్ ఆదేశాల మేరకు డిఎస్పి ఉదయ్ రెడ్డి ఆధ్వర్యంలో రూరల్ సీఐ సదన్ కుమార్, తంగళ్ళపల్లి ఎస్సై వెంకటేశ్వర్లు గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన వాహన ధ్రువీకరణ పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 28 ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలు, ఒక ట్రాలీ, మద్యం సీసాలను సీజ్ చేసినట్లు తెలిపారు. సీజ్ చేసిన వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించామని, సంబంధిత ధృవీకరణ పత్రాలను చూపించి తిస్కెల్లాలని తెలిపారు. డి.ఎస్.పి, సీఐ గ్రామ ప్రజలకు పలు సూచనలు చేశారు. యువత చెడు అలవాట్లకు బానిసలు కావద్దని, గంజాయితో యువత జీవితాలు, భవిష్యత్ అంధకారంలోకి వెళ్తుందని, పిల్లల ప్రవర్తనపై తల్లి దండ్రులు దృష్టి సారించాలని అన్నారు.
వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని, రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ శాతం హీడ్ ఇంజుర్ ద్వారానే మరణాలు జరుగుతున్నాయని తెలియజేశారు. ముఖ్యంగా ప్రస్తుతం ఆన్లైన్ మోసాలు అధికమయ్యాయి అని అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ డీటైల్స్, ఓటిపి లు షేర్ చేయవద్దని, ఎవరైనా అపరిచితుల నుండి ఫోన్ కాల్స్ వచ్చిన, ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.