Wednesday, April 2, 2025
Homeనేరాలు-ఘోరాలుFake Gold: వైజాగ్‌లో 2.2 కేజీల నకిలీ బంగారాన్ని పట్టుకున్న ద్వారకానగర్ పోలీసులు

Fake Gold: వైజాగ్‌లో 2.2 కేజీల నకిలీ బంగారాన్ని పట్టుకున్న ద్వారకానగర్ పోలీసులు

వైజాగ్‌లో 2.2 కేజీల నకిలీ బంగారాన్ని(Fake Gold) ద్వారకానగర్ పోలీసులు పట్టుకున్నారు. బ్యాంకుల్లో గోల్డ్ విడిపించి కమిషన్ వ్యాపారం చేసే జగదీశ్వర్ రావు అనే వ్యక్తి ఫిర్యాదుతో దొంగ బంగారాన్ని పట్టుకున్నారు.

- Advertisement -

రుపిక్ బ్యాంకులో మోహన్ రావు అనే వ్యక్తి రూ.68 లక్షల 31 వేలను టేకవర్ లోన్ తీసుకుని మోసానికి ప్లాన్ చేసిన వైనం చోటుచేసుకుంది.

జగదీశ్, అవినాష్ అనే ఇద్దరు స్నేహితులు ఫెడరల్ బ్యాంక్ అకౌంట్‌కు రూ.68 లక్షల 31 వేలు నగదును ట్రాన్స్‌ఫర్‌ చేసి గోల్డ్ విడిపించి చెక్ చేయడంతో ఈ మోసం బయటపడింది. నకిలీ బంగారంతో మోసం చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News