Sunday, April 13, 2025
Homeనేరాలు-ఘోరాలుEarthquake: రామగుండంలో అధిక తీవ్రతతో భూకంపం సంభవించే అవకాశం..!!

Earthquake: రామగుండంలో అధిక తీవ్రతతో భూకంపం సంభవించే అవకాశం..!!

తెలంగాణలోని రామగుండంలో భూకంపం(Earthquake) సంభవించే అవకాశం ఉందని ‘ఎర్త్‌క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్’ హెచ్చరికలు జారీచేసింది. తమ పరిశోధనల ప్రకారం రామగుండం సమీపంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని, దాని తీవ్రత హైదరాబాద్, వరంగల్ నుంచి అమరావతి, మహారాష్ట్ర వరకు ఉండవచ్చని తెలిపింది.

- Advertisement -

ఈ విషయాన్ని ప్రభుత్వం కానీ, శాస్త్రీయ సంస్థలు కానీ ధ్రువీకరించలేదు. భూకంపాలను ముందస్తుగా అంచనా వేయడం సాధ్యం కాదని అంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పసిఫిక్ జోన్ రెండు, మూడులో ఉన్నాయని, కాబట్టి ఇక్కడ తక్కువ నుంచి ఓ మోస్తరు భూకంపాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని తెలుపుతున్నారు.

గతంలోనూ ఈ ప్రాంతంలో భూకంపాలు వచ్చినా అవి నష్టం కలిగించలేదని గుర్తు చేస్తున్నారు. కాబట్టి నిర్ధారించని సమాచారంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐఎండీ అధికారులు తెలుపుతున్నారు. 1969లో ప్రకాశం జిల్లాలోని ఒంగోలు ప్రాంతంలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. 1998లో తెలంగాణలోని ఆదిలాబాద్‌లో 4.5 తీవ్రతతో భూంకంపం వచ్చింది. 1984, 1999, 2013లలో హైదరాబాద్‌లో చిన్నచిన్న భూకంపాలు వచ్చాయి. భూకంపాల రాకను ముందస్తుగా అంచనా వేయడం సాధ్యం కాదని, కాబట్టి భయం అవసరం లేదని అంటున్నారు. అయితే, అప్రమత్తంగా మాత్రం ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News