Saturday, September 21, 2024
Homeనేరాలు-ఘోరాలుRamagundam CP: గ్రామానికి రెండు సిసి కెమెరాలుండాల్సిందే

Ramagundam CP: గ్రామానికి రెండు సిసి కెమెరాలుండాల్సిందే

జిల్లా పోలీస్ అధికారులతో సిపి సమీక్షా సమావేశం.

రామగుండం పోలీస్ కమిషనర్ పరిధి మంచిర్యాల జోన్ డిసిపి సుదీర్ రాంనాథ్ కేకన్ ఐపిఎస్. పోలీసు అధికారులతో రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపీఎస్, డిఐజి నేర సమీక్ష సమావేశంను పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించారు. వరదలు సమయంలో దైర్యంగా విధులు నిర్వహించి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎక్కవ జరగకుండా ప్రజలకు అందుబాటులో ఉన్న మంచిర్యాల డిసిపి సుదీర్ కేకన్ ఐపిఎస్, లకు సిపి ప్రశంస పత్రం అందజేశారు. అధికారులకు, సిబ్బంది రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత నెలలో ఫంక్షనల్ వర్టికల్స్ లో ప్రతిభ కనబరిచిన 09-ఇన్స్పెక్టర్స్ ,23- ఎస్ ఐ లు,05 -ఎఎస్ఐ లు,20 -హెడ్ కానిస్టేబుల్, 51- కానిస్టేబుల్ లకి రివార్డు మేళా నిర్వహించారు.

- Advertisement -

ఈ సమావేశంలో సిపి క్రింది అంశాలపై సమీక్షా నిర్వహించారు. యుఐ కేసులు, గ్రేవ్ యుఐ లాంగ్ పెండింగ్‌లో కేసుల పరిష్కారంపై సమీక్షా, ఎస్సీ / ఎస్టీ యుఐ కేసులు, విమెన్ ఎగైనెస్ట్ కేసులు, పోక్సో కేసుల పరిష్కారం, కన్వెన్షన్ పై సమీక్షా, ఎన్.డి.పి.ఎస్ యాక్ట్ కేసుల, ఎన్.హెచ్.ఆర్.సి., ఎస్.హెచ్.ఆర్.సి మహిళా కమిషన్‌కు సంబంధించిన అప్పీల్ పిటిషన్ పెండింగ్ పై సమీక్షా, విలేజ్ సిసి టివి ప్రాజెక్ట్ ద్వారా రామగుండం పోలీస్ కమిషన్ పరిధిలో గ్రామాల వారీగా సిసి కెమెరాల ఏర్పాటు, కెమెరాలు పనితీరు, గ్రామాల వారీగా పురోగతిపై సమీక్ష, ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, ఆకస్మిక తనిఖీలు, ఇ-పెట్టి కేసులు, ఐడి లిక్కర్ గంజాయి, నకిలీ విత్తనాల అక్రమ రవాణా నిల్వకి సంబందించిన కేసుల వివరాలు, తీసుకుంటున్న చర్యలపై సమీక్షా, సైబర్ క్రైమ్ కేసుల పురోగతి, అవగాహన, శిక్షణ కార్యకలాపాలపై సమీక్షా నిర్వహించారు. ఈ సందర్బంగా సిపి మాట్లాడుతూ… అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసులను త్వరగా డిస్పోజల్ చేయాలి, పోక్సో, ఎస్సీ, ఎస్టీ గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులోఛార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండడంతో పాటు పూర్తి పారదర్శకంగా కేసును ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు. పోక్సో ఎస్సీ, ఎస్టీ కేసుల్లో 60 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఛార్జీ షీట్ దాఖలు చేయాలన్నారు. సైబర్ నేరాల్లో ఫ్రీజ్ అయిన డబ్బులను త్వరగా బాధితులకు ఇప్పించే విధంగా తగుచర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం విజబుల్ పోలీసింగ్లో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించాలని, రాత్రి పెట్రోలింగ్ అధికారులు లాడ్జిలు, పాత నేరస్తులను తనిఖీ చేయాలని తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకోవాలి. సరిహద్దు ప్రాంత అధికారులతో సమన్వయం చేస్తూ నిఘా ఉంచాలి. ఫెర్రీ పాయింట్స్ పై నిఘా ఉంచాలి, కూబింగ్, ఆకస్మిక తనిఖీలు, నాఖ బందీలు, ఏరియా డామినేషన్, ఆర్ఓపి లు, కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలు, కళాబృందంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. నిరుద్యోగ యువత శిక్షణ లు ఇప్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, జాబ్ మేళాలు, మెడికల్ క్యాంప్స్ నిర్వహించాలి. సీసీటీవీ కెమెరాలను రామగుండం పోలీస్ కమిషనరేట్ లోని హైవే రోడ్స్ పైన అర్బన్ సెంటర్స్ లో పెద్దపెద్ద గ్రామాలతో పాటు చిన్న చిన్న ప్రతి గ్రామంలో రెండు సీసీ కెమెరాలను కమ్యూనిటీ పోలీసులలో భాగంగా ఏర్పాటు చేశారు.

మంచిర్యాల జోన్ పరిధిలో 459 గ్రామాలు /డివిజన్స్ /వార్డ్స్ లలో 2644 మొత్తం 6236 సిసి కెమెరాలు ఏర్పాటు జరిగింది. నేరాలు నియంత్రణకి సీసీ కెమెరాల పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుంది. ఏదైనా నేరం జరిగిన తొందరగా నిందితులను పట్టుకోవడానికి ఉపయోగపడతాయి అన్నారు. ఈ సమావేశంలో మంచిర్యాల డిసిపి సుదీర్ రాంనాథ్ కేకన్ ఐపిఎస్, అడిషనల్ డీసీపీ ఏ ఆర్ రియాజ్ హుల్ హాక్, మంచిర్యాల ఏసిపి తిరుపతిరెడ్డి, జైపూర్ ఎసిపి మోహన్, బెల్లంపల్లి ఏసిపి సదయ్య, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి వెంకటేశ్వర్లు, టాస్క్ ఫోర్ సిఎస్ సిపి మల్లారెడ్డి, ట్రాఫిక్ ఏసిపి నరసింహులు, ఈవో నాగమణి, ఏఆర్ ఏసిపిలు సుందర్రావు, మల్లికార్జున్ ఇన్స్పెక్టర్ లు, ఆర్ఐ లు, ఎస్ఐ లు, సీపీఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News