Man Dies By Suicide After Blackmail: హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఒక 19 ఏళ్ల విద్యార్థి బ్లాక్‌మెయిలింగ్‌కు గురై ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగించి, దుండగులు అతని ముగ్గురు సోదరీమణుల అశ్లీల చిత్రాలు, వీడియోలను సృష్టించి, డబ్బులు డిమాండ్ చేశారు. ఈ మానసిక క్షోభను తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు.
డీఏవీ కాలేజీలో సెకండియర్ చదువుతున్న రాహుల్ భారతి గత రెండు వారాలుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నాడని అతని తండ్రి మనోజ్ భారతి తెలిపారు. ఎవరో తన ఫోన్‌ను హ్యాక్ చేసి, ఏఐ ద్వారా రాహుల్, అతని సోదరీమణుల నగ్న ఫొటోలు, వీడియోలను సృష్టించి వేధిస్తున్నారని ఆయన చెప్పారు. రాహుల్ కొన్నాళ్లుగా సరిగా తినడం లేదని, గదిలో మౌనంగా ఉంటున్నాడని తండ్రి తెలిపారు.
రూ. 20,000 డిమాండ్
దర్యాప్తులో భాగంగా, రాహుల్‌కు ‘సాహిల్’ అనే వ్యక్తికి మధ్య జరిగిన చాట్ బయటపడింది. ఆ వ్యక్తి అశ్లీల దృశ్యాలను పంపి రూ. 20,000 డిమాండ్ చేసినట్లు తెలిసింది. వాట్సాప్ సంభాషణల స్క్రీన్‌షాట్‌లలో ఆ ఇద్దరి మధ్య అనేక ఆడియో, వీడియో కాల్స్ జరిగాయి. ‘సాహిల్’ చివరి సంభాషణలో డబ్బు చెల్లించకపోతే అన్ని ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. అంతేకాక, రాహుల్‌ను ఆత్మహత్యకు పురికొల్పేలా మాట్లాడటమే కాకుండా, చనిపోవడానికి ఉపయోగించే పదార్థాలను కూడా వివరించాడని తెలిసింది.
ALSO READ: Man Slits Twin Daughters’ Throats: భార్యపై కోపం.. రెండేళ్ల కవల కుమార్తెల గొంతు కోసి చంపిన తండ్రి
మానసిక వేధింపులకు గురైన రాహుల్ శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో కొన్ని మాత్రలు మింగాడు. అతని పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు.
కుటుంబ సభ్యుడిపై అనుమానం
ఈ ఘటనలో నీరజ్ భారతి అనే మరో వ్యక్తి కూడా భాగమై ఉండవచ్చని రాహుల్ కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. రాహుల్ ఆత్మహత్య చేసుకునే కొన్ని గంటల ముందు నీరజ్ అతడితో మాట్లాడినట్లు వారు చెప్పారు. రాహుల్ తల్లి మీనా దేవి, తమ సోదరుడి భార్య ఈ కుట్ర వెనుక ఉందని, ఆమెతో ఆరు నెలల క్రితం గొడవ జరిగిందని ఆరోపించారు.
రాహుల్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు సైబర్‌క్రైమ్, ఏఐ టెక్నాలజీ దుర్వినియోగానికి సంబంధించిన దారుణ ఉదాహరణ అని ఓల్డ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ విష్ణు కుమార్ తెలిపారు. రాహుల్ మొబైల్ ఫోన్‌ను పరిశీలిస్తున్నామని, దర్యాప్తు ఫలితాల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని విచారణాధికారి సునీల్ కుమార్ తెలిపారు.
ALSO READ: Tribal Minors Gang Raped: ఒడిశాలో ‘జాతర’ చూసి వస్తుండగా ఇద్దరు మైనర్ గిరిజన బాలికలపై గ్యాంగ్ రేప్


