ఉత్తరప్రదేశ్లో (Uttara Pradesh) ఘోర రోడ్డు ప్రమాదం( Road Accident) చోటుచేసుకుంది. బస్సును బొలేరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణీకులు స్పాట్లోనే మృతి చెందారు.
మీర్జాపూర్- ప్రయాగ్రాజ్ హైవేపై ఈ ఘటన జరిగింది. మరో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో బొలెరో నుజ్జునుజ్జుయింది.
మృతులు ఛత్తీస్ గఢ్ వాసులుగా గుర్తించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా సహయక చర్యలు కొనసాగుతున్నాయి.
సమాచారం తెలుసుకున్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. సహయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
Accident: ఘోర రోడ్డు ప్రమాదం,10 మంది స్పాట్ డెడ్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES