Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుOld City Crime: ఛీ వీడసలు మనిషే కాదు.. ఏ కొడుకుకు ఇలాంటి తండ్రి ఉండకూడదు..!

Old City Crime: ఛీ వీడసలు మనిషే కాదు.. ఏ కొడుకుకు ఇలాంటి తండ్రి ఉండకూడదు..!

father killed 2 year old son: చేయి పట్టి నడిపించాల్సిన కన్న తండ్రే.. ఆ బాలుడి పాలిట కాలయముడయ్యాడు. కన్న కొడుకునే తండ్రి అత్యంత కిరాతకంగా గొంతు నులిమి హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌ని పాతబస్తీలో జరిగింది. కొడుకుకు అనారోగ్య సమస్యలున్నాయనే కారణంతో.. కన్న తండ్రే కసాయివాడై కుమారున్ని చంపేశాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.

- Advertisement -

రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్: హైదరాబాద్‌లోని పాతబస్తీ బండ్లగూడ ప్రాంతంలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. రెండున్నరేళ్ల వయసున్న కొడుకును తండ్రి అత్యంత పాశవికంగా హతమార్చాడు. ఆ తర్వాత ఆ చిన్నారి మృతదేహాన్ని మూసీ నదిలో పడేశాడు. కొడుకు అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడమే ఈ దారుణానికి ప్రధాన కారణమని పోలీసులు తెలిపారు. కుటుంబసభ్యులు గట్టిగా నిలదీయడంతో.. ఈ విషయం బయటపడింది. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు మూసీ నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. హైడ్రా, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సైతం రంగంలోకి దిగారని పోలీసు అధికారులు తెలిపారు.

తమదైన శైలిలో విచారణ: కొన్నాళ్లుగా ఆ చిన్నారికి నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పండ్ల వ్యాపారి అయిన ఆ తండ్రి.. ఈ నెల 12న మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లి తిరిగి వచ్చాడు. అదే రోజు తెల్లవారుజామున బాలుడి గొంతు నులిమి చంపాడు. ఆ తర్వాత చిన్నారి మృత దేహాన్ని నయాపూల్ వంతెన మీదుగా మూసీ నదిలో విసిరేశాడు. బాలుడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం మొదలుపెట్టారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రిపై అనుమానం రావడంతో.. పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో తండ్రే ఆ చిన్నారని చంపాడనే విషయాన్ని పోలీసులు నిర్ధారించారు. తన నేరాన్ని చేసినట్లుగా పోలీసుల ముందు నిందితుడు ఒప్పుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad