Tuesday, April 15, 2025
Homeనేరాలు-ఘోరాలుFire Accident: బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం.. 8 మంది మృతి

Fire Accident: బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం.. 8 మంది మృతి

అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని బాణసంచా తయారీ కేంద్రం(fireworks manufacturing plant)లో ఆదివారం అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. ఈ మంటల్లో చిక్కుకొని 8 మంది మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందితోపాటు పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

అయితే వారికి మెరుగైన వైద్య చికిత్స కోసం నర్సీపట్నంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. ఇక ఈ అగ్నిప్రమాదం సంభవించిన బాణ సంచా కేంద్రానికి ప్రభుత్వ లైసెన్స్ ఉందని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ క్రమంలో ఈ ప్రమాదానికి గల కారణాలను ప్రత్యక్ష సాక్షలను అడిగి పోలీసులు తెలుసుకున్నారు. ఘటన స్థలాన్ని పోలీసు ఉన్నతాధికారులు సందర్శించారు.

ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనిత స్పందించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News