Sunday, June 23, 2024
Homeనేరాలు-ఘోరాలుGarla: 59 కిలోల గంజాయి పట్టివేత

Garla: 59 కిలోల గంజాయి పట్టివేత

ఒరిస్సా నుంచి ముంబైకి..

మాదక ద్రవ్యాల రవాణా నేరమని, దీనిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని
సీఐ బి రవి కుమార్ పేర్కొన్నారు. స్థానిక ఎస్సై జీనత్ కుమార్, ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తుండగా ఒరిస్సా రాష్ట్రం, జిల్లా గాజపడి రాకేష్ పంక గ్రామానికి చెందిన, లిల్లీ మాలిక్ (27) (ఆదివాసి) తండ్రి గుర్జి మాలిక్ స్థానిక రైల్వే స్టేషన్ లోపల నుంచి మూడు ట్రాలీ బ్యాగులు, ఒక ఫోల్డర్ బ్యాగుతో వెలుపలికి రాగానే పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులను చూసి తిరిగి రైల్వే స్టేషన్ లోపలికి పారిపోవుటకు యత్నించిందని తెలిపారు. ఇది గమనించిన పోలీసులు ఆమెను చూసి పట్టుకొని ఆధీనంలోకి తీసుకుని తనిఖీ చేయగా గోధుమ రంగు ప్లాస్టిక్ టేప్ తో చుట్టిన రూ, 20 లక్షల విలువ చేసే 59 కేజీలు గల 29 గంజాయి ప్యాకెట్లు లభ్యమైనాయని ఆయన వివరించారు.

- Advertisement -

పోలీసులు ఆమెను ప్రశ్నించగా తాను ( లిల్లీ) ఒరిస్సా నుంచి ముంబైకి గంజాయి రవాణా చేస్తూ ట్రైన్లో పోలీసుల తనిఖీ చూసి బయటపడి గార్ల రైల్వే స్టేషన్ లో దిగి వెలుపలికి వచ్చానని తెలిపింది. వెంటనే పెట్రోలింగ్ పోలీసులు పట్టుకొని ఆమె వద్ద నుంచి 1,రెండు ఎరుపు రంగు ట్రాలీ బ్యాగులు,2 ఒకటి వైలెట్ రంగు ట్రాలీ బ్యాగ్, 3 సెల్ ఫోన్స్ నాలుగు,4 ఫోల్డర్ బ్యాగులను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మాదక ద్రవ్యాల ఆచూకీ తెలిస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాలని, మాదక ద్రవ్యాలు-వ్యసనాల పై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు.

అంతర్ రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఒడిషా రాష్ట్రానికి చెందిన మహిళా లిల్లీ మాలిక్ నుపట్టుకోవడంలో చురుకుగా పాల్గొన్న ఎస్సై జీనత్ కుమార్, పోలీస్ స్టేషన్ సిబ్బందిని, జిల్లా ఎస్పీ శ్రీరామనాథ్ సుధీర్ కేకన్, అడిషనల్ ఎస్పీ జి చెన్నయ్య డిఎస్పి ఎన్ తిరుపతిరావు, సిఐ బి రవికుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రవీందర్ సర్వర్ పాష, పుష్ప సతీష్ మంగీలాల్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News