Thursday, April 18, 2024
Homeనేరాలు-ఘోరాలుGarla: నాటు సారా పట్టివేత

Garla: నాటు సారా పట్టివేత

మహిళపై కేసు నమోదు

నాటు సారా నిర్మూలనే లక్ష్యంగా పోలీసులు ముమ్మరంగా దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నప్పటికీ గుడుంబా తయారీదారులు ఏమాత్రం భయం లేకుండా పొదల్లో తోటల్లో రహస్యంగా సారా బట్టీలు పెట్టి అక్రమంగా గుడుంబా తయారు చేసి విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రభుత్వ నిషేధించిన గుడుంబాను అక్రమంగా తయారు చేసి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న 7 లీటర్ల నాటు సారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

ఎస్‌ఐ జీనత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం గార్ల మండల పరిధిలోని శేరిపురం గ్రామ శివారులో తన సిబ్బందితో కలసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో నాటు సారా తయారు చేస్తున్నట్లు నమ్మదగిన సమాచారం రావడంతో ఈ మేరకు ఆదివారం తనిఖీలు నిర్వహించగా గుగులోత్ హమాలి తన ఇంటి వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 7 లీటర్ల నాటు సారాను గుర్తించి పట్టుకొని సదరు మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అక్రమంగా నాటుసారా తయారు చేసినా, అమ్మినా కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News