Tuesday, April 23, 2024
Homeనేరాలు-ఘోరాలుGarla: గుడుంబా స్వాధీనం

Garla: గుడుంబా స్వాధీనం

20 లీటర్ల నాటుసారా..

అక్రమంగా గుడుంబా, తయారు చేసినా, విక్రయించిన కఠిన చర్యలు తప్పని సబ్ ఇన్స్పెక్టర్ జీనత్ కుమార్ హెచ్చరించారు. అక్రమంగా విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న 20 లీటర్ల నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ జీనత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం గార్ల మండల పరిధిలోని అంజనాపురం పెద్ద కిష్టాపురం గ్రామాల్లో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో నాటు సారా తయారు చేస్తున్నట్లు సమాచారం రావడంతో గ్రామంలో తనిఖీలు నిర్వహించగా గుగులోత్ మహేష్ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 8 వేల రూపాయల విలువగల 20 లీటర్ల నాటు సారాను గుర్తించి పట్టుకొని సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News