సెలబ్రిటీలకు వివాదాలు నిత్యకృత్యాలవుతున్నాయి. తాజాగా గౌరీ ఖాన్ పై ఓ వ్యక్తి కోర్టుకెక్కాడు. షారూఖ్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీలో తాను ఫ్లాట్ కొని చిక్కుల్లో పడ్డట్టు ఇందుకు గౌరీనే కారణం అంటూ ఆయన కోర్టుకెక్కాడు.
వివారాల్లోకి వెళితే.. జస్వంత్ సింగ్ అనే అతను గౌరీ ఖాన్ ఎండార్స్ మెంట్ చేస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీలో ఇల్లు కొనేందుకు 86 లక్షలు చెల్లించాడు. లక్నోలోని ఈ అపార్ట్మెంట్ 2016లో ఆయనకు హ్యాండోవర్ చేస్తామని చేయలేదంటూ జస్వంత్ కోర్టు కేసు వేశాడు. సుశాంత్ గోల్ఫ్ సిటీలో ఈ ఫ్లాట్ ఉన్నట్టు ఆయన చెబుతూ ఇప్పటికే లక్నోలోని తుల్సియాని కన్స్ట్రక్షన్, గౌరీ ఖాన్ పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడు. గౌరీ ఖాన్ ఎండార్స్మెంట్ చేసిన యాడ్ చూసి ప్రభావితుడై మాత్రమే తాను అపార్ట్మెంట్ కొన్నట్టు ఈయన వాదిస్తున్నాడు. గౌరీ ఎండార్స్ చేసిన ఆ యాడ్ ఫోటోను మీరు పైన చూశారు కదా.