Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుBoyfriend : బాయ్‌ఫ్రెండ్‌కు బైక్ కొనివ్వాలని... ఛత్తీస్‌గఢ్‌లో వింత ప్రేమకథ!

Boyfriend : బాయ్‌ఫ్రెండ్‌కు బైక్ కొనివ్వాలని… ఛత్తీస్‌గఢ్‌లో వింత ప్రేమకథ!

Girl becomes thief for boyfriend :  ప్రేమ కోసం కొందరు ప్రాణాలిస్తారు, మరికొందరు ప్రపంచాన్నే ఎదిరిస్తారు. కానీ, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ యువతి తన ప్రేమను నిలబెట్టుకోవడానికి ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ప్రియుడి చిన్ని సరదా తీర్చడం కోసం ఏకంగా దొంగగా మారింది. స్నేహితుడి ఇంట్లోనే కన్నం వేసి లక్షల రూపాయల సొత్తును దోచుకెళ్లింది. అసలు ప్రియుడి కోసం ఆమె ఏం చేసింది…? ఎంత పెద్ద చోరీకి పాల్పడింది..? చివరికి వారి ప్రేమకథ ఎలా కంచికి చేరింది..?

- Advertisement -

ప్రేమ గుడ్డిది అంటారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఉత్తర బస్తర్ కంకేర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనే అందుకు నిలువెత్తు సాక్ష్యం. ప్రియుడి కల నెరవేర్చాలన్న తపనతో ఓ యువతి ఏకంగా దొంగగా మారి, చివరికి ప్రియుడితో పాటే కటకటాల పాలైంది.

పోలీసుల కథనం ప్రకారం : కంకేర్ అదనపు ఎస్పీ దినేశ్ సిన్హా తెలిపిన వివరాల ప్రకారం, “ఆగస్టు 9న దుమర్పాణి గ్రామానికి చెందిన కన్హయ్య పటేల్ అనే వ్యక్తి తన ఇంట్లో దొంగతనం జరిగిందని హల్బా చౌకీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు మేము దర్యాప్తు ప్రారంభించాం. దొంగతనం జరిగిన రోజున కరుణ పటేల్ (22), తామ్రధ్వజ్ విశ్వకర్మ (24) అనే ఇద్దరు యువతీ యువకులు గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు మాకు సమాచారం అందింది. పక్కా ప్రణాళికతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, కరుణ పటేల్ తన నేరాన్ని అంగీకరించింది. ఆమె చెప్పిన నిజాలు విని మేమే ఆశ్చర్యపోయాం.”

బాధితుడి ఆవేదన: బాధితుడైన కన్హయ్య పటేల్ మాట్లాడుతూ, “ఆగస్టు 8న మధ్యాహ్నం కూరగాయలు అమ్మడానికి మార్కెట్‌కు వెళ్లాను. రాత్రి 8 గంటలకు తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూస్తే, రెండు వేర్వేరు పెట్టెల్లో దాచిన రూ. 95 వేల నగదు, బంగారు, వెండి ఆభరణాలు మాయమయ్యాయి. వెంటనే మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాను” అని తన గోడు వెళ్లబోసుకున్నాడు.

ప్రియుడి కోసమే ఈ నేరం: పోలీసుల విచారణలో నిందితురాలు కరుణ పటేల్ తన నేరాన్ని ఒప్పుకుంటూ వాంగ్మూలం ఇచ్చింది. ఆమె చెప్పిన వివరాలు పోలీసుల మాటల్లోనే… “నేను, తామ్రధ్వజ్ 2019 నుంచి ప్రేమించుకుంటున్నాం. నా ప్రియుడు ఒక మోటార్ సైకిల్ కొనాలని ఎప్పటినుంచో ఆశపడుతున్నాడు. కానీ, దానికోసం సరిపడా డబ్బు అతని దగ్గర లేదు. ఎలాగైనా డబ్బు సంపాదించాలని ఇద్దరం కలిసి దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాం. మా స్నేహితుడైన కన్హయ్య పటేల్ ఇంటినే లక్ష్యంగా చేసుకున్నాం. నేను ఇంటి తాళం పగలగొట్టి లోపలికి వెళ్తుండగా, తామ్రధ్వజ్ బయట కాపలాగా ఉన్నాడు. గదిలోని పెట్టెలో ఉన్న రూ. 95 వేల నగదుతో పాటు, సుమారు రూ. 2 లక్షల విలువైన బంగారు, వెండి నగలను దొంగిలించి మా ఇంటికి తీసుకెళ్లాను.”

ఈ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు నిందితుడు తామ్రధ్వజ్ విశ్వకర్మ ఇంట్లో దాచిన రూ. 95 వేల నగదును, నిందితురాలు కరుణ పటేల్ వద్ద ఉన్న రూ. 2 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ దినేశ్ సిన్హా వెల్లడించారు. ప్రియుడి కోసం యువతి దొంగగా మారిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. పోలీసులు ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.


సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad