గోదావరిఖని ఇందిరానగర్ లో వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో యువతకు, మహిళలకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సి.ఐ. ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. రోజురోజుకీ టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్ది సైబర్ నేరగాళ్లు కొత్త తరహా నేరాలకు పాల్పడుతూ అమాయకులైన ప్రజలను మోసం చేస్తున్నారని, అపరిచిత వ్యక్తులకు OTP నెంబర్ చెప్పడం వల్ల బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతున్నాయానీ అన్నారు.
సెల్ పోన్ కు అనుమానాస్పద లింకులు వస్తే క్లిక్ చేయవద్దు సూచించారు. ఒకవేళ ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే 1930కు కాల్ చేసి చెప్పాలనీ అన్నారు. అంతేకాక తల్లిదండ్రులు మైనరులకు వాహనాలు ఇవ్వకుడదనీ, సరదా కోసం విపరీతమైన వేగంతో వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు గురికావాల్సి వస్తుందనీ అన్నారు.
ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సి.ఐ. ఇంద్రసేనారెడ్డి,ఎస్ఐ ఎన్ సుగుణాకర్, గోదావరిఖని వన్ టౌన్ సిబ్బంది పాల్గొన్నారు.