గోదావరిఖని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులకు సైబర్ నేరాలు, మహిళల భద్రత అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ కటకం అంజయ్య అధ్యక్షత వహించగా గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హాజరై ప్రసంగించారు. ముఖ్యంగా విద్యార్థులు ఈ రోజుల్లో సెల్ ఫోన్లో మాయలో పడి విలువైన జీవితాలను కోల్పోతున్నారని వేటగాళ్ల ఉంచులో చిక్కి తమ అమూల్యమైన భవిష్యత్తును ఫణంగా పెడుతున్నారని కొన్ని సంఘటనలను ఉదాహరణగా చూపిస్తూ ప్రసంగించారు.
అదేవిధంగా అనవసరపు లింకులను ఓపెన్ చేయడం ద్వారా స్వయంగా కష్టాల్లోకి పెట్టబడతారని విద్యార్థులకు పలికారు అపరిచితులు ఫోన్ కాల్స్ ద్వారా పరిచయం చేసుకుని తర్వాత మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా ఇంటర్ విద్యార్థులు వయసు ఆకర్షణకు లోను అవుతుందని తద్వారా ఏదో కొత్తదనం నేర్చుకోవాలని ఉబలాటంతో వాళ్లకై వాళ్లే ప్రమాదంలో చిక్కుకుంటున్నారని తెలిపారు. మహిళల భద్రతకై పోలీసులు యంత్రాంగం నిరంతరం శ్రమిస్తుందని 24 గంటలు ఏ సమయంలోనైనా వంద నెంబర్ కి డయల్ చేస్తే లోకేషన్ ఆధారంగా వాళ్ల ముందు ఉంటామని ప్రమాదం నుంచి బయటపడేస్తామని పోలీసు వ్యవస్థ పనితీరును వివరించారు.
ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ సుగుణాకర్, కళాశాల అధ్యాపకులు రజిత, శంకర్, సంపత్, రాజలక్ష్మి , పోలీస్ కానిస్టేబుల్ సిబ్బంది పాల్గొన్నారు.