సెల్ఫోన్ డబ్బుల కోసం నానమ్మను చంపిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, మృతురాలి బందువులు అందించి సమాచా రకు పెద్దమరివీడు గ్రామానికి చెందిన కురువ నాగమ్మ (80)కు చిన్నబజారీ, పెద్దబజారి అని ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు గ్రామంలో కూలీ పని చేసి జీవనం సాగించేవాడు. ఇతనికి భార్య, పిల్లలు ఉన్నారు. చిన్న బజారి కర్నూలులో స్థిరపడ్డాడు, అయితే చిన్న బజరి పెద్దమరివీడులో స్వంతంగా ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంట్లో తన తల్లిని ఉండమన్నాడు. అందులో కురువ నాగమ్మ ఒంటరిగా జీవనం చేస్తుంది. అయితే పెద్ద కుమారుడు అయిన పెద్ద బజారి గ్రామంలో కూలీ పనులు లేక పోవడంతో బతుకు తెరువు లోసం గుంటూరుకు తన కుటుంబ సభ్యులైన భార్య పిల్లలతో వలసపోయాడు వెంకటేష్ కు కొత్త సెల్ ఫోన్ కొనుకోవాలని కోరిక కలిగింది. అయితే డబ్బులు లేక పోవడంతో సెట్ కానలేదు. ఒక పథకం ప్రకారం తల్లిదండ్రులకు మాయ మాటలు చెప్పి స్వంత గ్రామమైన పెద్ద మరివీడుకు వచ్చాడు. తన ఇంట్లో ఉంటూ పథకం వేశాడు. తన నానమ్మ దగ్గర ఉన్న బంగారు ను దొంగలించాని అలోచించాడు. గత ఈ నెల 4వ తేదీన వెంకటేష్ నానమ్మ ఉన్న ఇంట్లోకి సాయంత్రం వెళ్లాడు. అక్కడ నాగమ్మను గొంతు నులిమి చంపి వేశాడు. ఆమె శరీరంపై ఉన్న రెండున్నర తులాల బంగారును తీసుకొని అనంతరం రాత్రి వరకు అక్కడే వేచి చూసి రాత్రి ఎవ్వరు వీదుల్లో తిరగని సమయంలో ఇంటి ఆవరణంలో ఉన్నస్థలంలో గుంత తవ్వి అందులో పూడ్చివేశాడు. ఏవి తెలియనట్లు ఉదయం ఎమ్మిగనూరుకు వెళ్లి అక్కడ ఓ దుకాణంలో బంగారును అమ్మకం జరిపాడు. వచ్చిన డబ్బులో నుంచి రూ. 25వేల పెట్టి కొత్త సెల్ ఫోన్ కొన్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చి ఏమి తెలియనట్లు గుంటూరులోని తన తల్లిదండ్రులకు దగ్గరకు వెళ్లాడు.
ఈ నెల 13 తేదిన చిన్నబాజారి కుమారుడు గోపాల్ గ్రామానికి వచ్చాడు. తన నానమ్మ అయిన నాగమ్మ ఇంట్లో లేక పోవడంతో ఎక్కడికి వెళ్లిందని విచారణ చేశాడు. ఇంటిపక్కన వీడిలో విచారణ చేసినప్పటికీ నానమ్మ జాడ కనిపించ లేదు. దీంతో అనుమానంతో అదే రోజు తన నానమ్మ కనిపించ లేదని గోనెగండ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేపట్టారు. మనవడు వెంకటేష్ వచ్చి వెళ్లిన తరువాత ఈ సంఘటన జరగడంతో అనుమానంతో పోలీసులు తమదైన శైలిలో వెంకటేష్ ను విచారించగా వాస్తవం బయటపడింది. కేసు నమోదు చేసుకున్నారు. హత్యకు కారణమైన విషయాలను వెంకటేష్ ను విచారణ చేస్తున్నాట్లు సీఐ రామకృష్ణయ్య తెలిపారు.