Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలుGonegandla: చివరి మజిలీకి కరువైన ఆరడుగుల స్థలం!

Gonegandla: చివరి మజిలీకి కరువైన ఆరడుగుల స్థలం!

మనిషి చనిపోతే ,మనిషి చివరి మజిలీకి కరువైన ఆరడుగుల స్థలం కోసం మృతరాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఏప్రిల్ 24 వ తేదీ నుండి ఏప్రిల్ 25 వ తేదీ మధ్యాహ్నం వరకు శవంతో రాత్రంతా రోడ్డుపై ధర్నా చేపట్టడం హృదయ విధారాఘటన చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా, గోనెగండ్ల మండలం, బి.అగ్రహారం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు కుటుంబ సభ్యులు ఆందోళనతో ప్రభుత్వ అధికార యంత్రాంగం కదిలివచ్చి అంత్యక్రియలు పూర్తి చేయించారు.

- Advertisement -

వివరాలు ఇలా ఉన్నాయి. అగ్రహారం గ్రామంలో ఏప్రిల్ 24 వ తేదీన బోయ మారెమ్మ( 70) వృద్ధురాలు అనారోగ్యంతో చనిపోయింది. ఆమె అంత్యక్రియలు నిమిత్తం గ్రామంలోనీ 40 సెంట్ల పరంపోగు స్థలంలో శవాన్ని పూడ్చటానికి కుటంబ సభ్యులు గుంతను కూడా తీసి వచ్చారు. అయితే తమ పొలం పక్కన పూడ్చటానికి వీల్లేదని అదే గ్రామానికి చెందిన అగ్రవర్ణ వ్యక్తి అడ్డగించి,ఆ గుంతను సైతం పూడ్చివేశారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆగ్రహంతో శవాన్ని తీసుకుని రోడ్డు పైనే ఉంచి ధర్నాకు దిగారు. అధికారులు న్యాయం చేయాలని కోరుతూ రాత్రంతా ధర్నా చేపట్టారు.

గోనెగండ్ల తహసీల్దార్ వేణుగోపాల్, ఎమ్మిగనూరు సిఐ మోహన్ రెడ్డి, గోనెగండ్ల ఎస్ఐ. తిమ్మారెడ్డి,విఆర్ఓ రామకృష్ణ గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పరిస్థితిని పరిశీలించి, ఇరువురి తో మాట్లాడి అంత్యక్రియలను పూర్తిచేయించారు. ఈసంద ర్భంగా వారు మాట్లాడుతూ గ్రామానికి స్మశాన వాటికకు సంబంధించిన అంశము గ్రామ పంచాయతీ తీర్మానం చేసి పంపిస్తే దానిపై విచారించి స్మశాన వాటిక కు స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు.దీంతో అగ్రహారంలో నెలకొన్న హృదయవికారా సంఘటన కు తెరపడింది. అంత్యక్రియలు అడ్డుకున్న వారికి స్థానిక ఎమ్మెల్యే మద్దతు ఉండడంతో అధికారులు కూడా ముందుకు రాలేని పరిస్థితి నెలకొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News