Sunday, September 8, 2024
Homeనేరాలు-ఘోరాలుHit and run: స్విగ్గీ ఏజెంట్ ను ఢీ కొట్టిన కారు, 500 మీటర్స్ లాక్కెళ్లి..

Hit and run: స్విగ్గీ ఏజెంట్ ను ఢీ కొట్టిన కారు, 500 మీటర్స్ లాక్కెళ్లి..

దేశ రాజధానిలో హిట్ అండ్ రన్ కేసుల సంఖ్య నిత్యం పెరుగుతోంది. కౌశల్ అనే స్విగ్గీ ఏజెంట్ ఫుడ్ డెలివరీ కోసం టూ వీలర్ పై వెళ్తుండగా కారు ఢీ కొట్టింది. నోయిడా సెక్టర్ 14లో జరిగిన ఈ ప్రమాదం అంజలి ప్రమాదాన్ని గుర్తు చేస్తోంది. కౌశల్ ను ఢీ కొట్టిన కారు ఏకంగా 500 మీటర్ల మేర ఆయన్ను లాక్కెళ్లింది. ఆదివారం రాత్రి అంటే న్యూ ఇయర్ రోజే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగాక 500 మీటర్ల దూరంలోని గుడి వద్ద ఆగిన కారు డ్రైవర్ డెడ్ బాడీ కారు నుంచి బయటికి రాగానే అక్కడి నుంచి పారిపోయాడు. ఈ వివరాలన్నీ ఆలస్యంగా వెలుగులోకి రాగా ఢిల్లీ పోలీసులు ఆ కారు, కారు డ్రైవర్ కోసం ఇంకా గాలిస్తూనే ఉన్నారు.

- Advertisement -

ఇటీవల దేశవ్యాప్తంగా స్విగ్గీ, జొమాటో ఏజెంట్లు చాలామంది ప్రమాదాల బారిన పడుతుండగా వారిలో ఎక్కువ మంది ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. అతి వేగం, హెల్మెట్ వంటివి ధరించకపోవటం, ఎక్కువ సేపు పనిగంటలు, ఎక్కువ కమీషన్ కోసం రెస్ట్ లేకుండా రేయింబవళ్లు ఫుడ్ డెలివరీలు చేసి వీరు విపరీతంగా అలసిపోతున్నారు. ఇక న్యూ ఇయర్, పండుగలు వంటి టైంలో వీళ్లకు ఫుల్ గిరాకీ ఉంటుంది. దీంతో కను రెప్ప వేసేందుకు కూడా కొందరు ఫుడ్ డెలివరీ ఏజెంట్లు బ్రేక్ తీసుకోకుండా ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతుండటం అందరినీ కలిచివేస్తోంది. 2022 లో ఢిల్లీలోని గురుగ్రాంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఏకంగా నలుగురు స్విగ్గీ ఏజెంట్లు ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News