Rape case in himchal pradesh: హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా, ధర్మశాల సమీపంలోని ఒక హోటల్‌లో దిల్లీకి చెందిన ఓ మహిళపై అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు రావడంతో హోటల్ యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దిల్లీకి చెందిన ఆ మహిళ తన ముగ్గురు స్నేహితులతో కలిసి ధర్మశాల సమీపంలోని ఒక హోటల్‌లో బస చేసింది. ఆదివారం నాడు ఆమె స్నేహితులు బయటకు వెళ్ళిన సమయంలో, హోటల్ యజమాని శుభం ఆమె గదిలోకి ప్రవేశించి అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని నిందితుడు ఆమెను బెదిరించినట్లు మహిళ ఆరోపించింది.
అయితే, బాధితురాలు ధైర్యంగా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు దాఖలు చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా, భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, నిందితుడు శుభంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై తదుపరి దర్యాప్తు జరుగుతోందని, పోలీసులు అన్ని కోణాల నుండి పరిశీలిస్తున్నారని అధికారులు తెలిపారు.


