Thursday, September 19, 2024
Homeనేరాలు-ఘోరాలుHyd: 200 kgల గంజాయి స్వాధీనం

Hyd: 200 kgల గంజాయి స్వాధీనం

హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ ఫోర్మ్సెంట్ వింగ్ (హెచ్-న్యూ) అధికారులు లంగర్ హౌస్ పోలీసులు సంయుక్తంగా మాదకద్రవ్యాల సరఫరాదారులను అరెస్టు చేశారు. హెచ్-న్యూ విభాగం డిప్యూటీ కమిషనర్ చక్రవర్తి గుమ్మి వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నిందితులు శ్రీనివాస రావు, సత్తిబాబు రాజమండ్రి నుంచి పండు, నగేశ్ అనే వ్యక్తుల సహకారంతో గంజాయిని సరఫరా చేసేవారు. సత్తిబాబు తన డీసీఎంను గంజాయి తరలించేందుకు ఇచ్చేవాడు. ఈ క్రమంలో సత్తిబాబు గంజాయిని తీసుకొని హైదరాబాద్ లోని డ్రగ్ పెడలర్లు మహ్మద్ హబీబ్, పర్వేజ్ లకు అందించేందుకు తీసుకొచ్చాడు. ఇక్కడి నుంచి గంజాయి మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ కు వెళ్తున్నట్లు గుర్తించిన హెచ్-న్యూ విభాగం అధికారులు లంగర్ హౌజ్ పోలీసులతో కలిసి ఆకస్మిక దాడి చేశారు. నిందితులు శ్రీనివాస్ రావు, సత్తిబాబు, మహ్మద్ హబీబ్ లను అరెస్టు చేశారు.

- Advertisement -

ముఠాలో భాగమైన పర్వేజ్, జావీద్, నగేశ్, పండులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 200ల కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. 3 సెల్ ఫోన్లతో పాటు డీసీఎం సీజ్ చేసినట్లు డీసీపీ వెల్లడించారు. తదుపరి విచారణ కోసం లంగర్ హౌజ్ పోలీసులకు అప్పగించామన్నారు. డ్రగ్స్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ను మార్చేందుకు ప్రజలు భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. అనుమానితులను గుర్తిస్తే 87126 61601 నెంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో హెచ్-న్యూ ఇన్స్ పేక్టర్ పి.రాజేశ్, ఎస్ఐ డానియల్ శాంతికుమార్, సిబ్బంది, లంగర్ హౌజ్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News