Thursday, September 19, 2024
Homeనేరాలు-ఘోరాలుHyd: తనిఖీల్లో 3.35 కోట్లు స్వాధీనం

Hyd: తనిఖీల్లో 3.35 కోట్లు స్వాధీనం

ఏడాదిగా హవాలా వ్యాపారం చేస్తున్నట్లు పేర్కొన్న నిందితులు

నగరంలో హవాలా వ్యాపారం సాగుతున్న ఘటన వెలుగు చూసింది. ఎన్నికల నిబంధనల అమలు నేపథ్యంలో హవాలా మార్గంలో తరలిస్తున్న డబ్బు పట్టుబడింది. మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డెవిస్ వివరాలను వెల్లడించారు. డీసీపీ మాట్లాడుతూ హనుమంత రెడ్డి, ప్రభాకర్,శ్రీరాములు, ఉదయ్ కుమార్ రెడ్డిలు బంజారాహిల్స్ లోని అరోరా కాలనీలో ఏడాది క్రితం ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కార్యాలయ కేంద్రంగా హవాలా సొమ్ము పంపిణీ కార్యకలాపాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో నిందితులు ఎప్పటిలాగానే బేగంబజార్, నాంపల్లి, జూబ్లీహిల్స్, గోషామహల్ నుంచి డబ్బులు తీసుకుని ఆఫీస్ వైపు వస్తున్నారు. ఈ క్రమంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు టీవీ9 కార్యాలయం వద్ద వారి వాహనాన్ని అడ్డుకున్నారు. వారి వద్ద నుంచి రూ.3.35కోట్ల నగదు, క్యాష్ కౌంటింగ్ మెషీన్, కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేశారు. కోటి రూపాయలకు రూ. 25వేలు కమిషన్ తీసుకొని హవాలా నగదు రవాణా చేసేవారని డీసీపీ జోయల్ వెల్లడించారు. రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లే వారు అందుకు సంబంధించిన సరైన లెక్కా పత్రాలు దగ్గర ఉంచుకోవాలని కోరారు. ఈ సమావేశంలో బంజారాహిల్స్ టాస్క్ ఫోర్స్ ఏసిపి పి. సుబ్బయ్య, సీఐ కే.సైదులు, బంజారాహిల్స్ సీఐ పి.సతీష్,టాస్క్ ఫోర్స్ ఎస్ఐలు అశోక్ రెడ్డి, జ్ఞానదీప్,నవీన్,ఎస్ఐ వెంకటేష్,పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News