ఆభరణాల చోరీ కేసులో నిందితుడిని ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ జోయల్ డేవిస్ తెలిపిన వివరాల ప్రకారం వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన వెలిశెట్టి శ్రీనివాస్(33) గచ్చిబౌలిలోని రాధికా డైమండ్స్ లో డ్రైవరుగా పనిచేస్తూ మధురానగర్ లో నివాసం ఉంటున్నాడు. ఫిబ్రవరి 17న సంస్థ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అక్షయ్ కుమార్ తో కలిసి మధురానగర్ లో వజ్రాభరణాలను డెలివరీ చేయడానికి వచ్చాడు. ఈ క్రమంలో అక్షయ్ కుమార్ ఆభరణాలను ఇచ్చేందుకు వెళ్లాడు. అతను తిరిగి వచ్చేలోపు మరో ఉద్యోగిని బెదిరించి కారులో ఉన్న ఆభరణాలతో శ్రీనివాస్ అక్కడ నుంచి పరారయ్యాడు. దీంతో అక్షయ్ కుమార్ ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేశారు. విశ్వసీయ సమాచారం మేరకు నిందితుడు మధురానగర్ లో ఉన్న విషయం తెలుసుకొని ఎస్ఆర్ నగర్ పోలీసులు అతడిని అరెస్టు చేశారని డీసీపీ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి రూ.7కోట్లు విలువ చేసే వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు.
Hyd: 7 కోట్ల విలువైన వజ్రాభరణాల స్వాధీనం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES