సీజ్ చేసిన వాహనాలతో పాటు స్వాధీనం చేసుకున్న గుర్తు తెలియని వాహనాలను పంజాగుట్టా పోలీసులు వేలం వేశారు. హైదరాబాద్ సిటీ పోలీస్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ జాయింట్ సీపీ, వేలంపాట కమిటీ చైర్మన్ ఎం.శ్రీనివాస్ ఆధ్వర్యంలో 16 వేలం పాటను నిర్వహించారు. గోషామహల్ పోలీస్ గ్రౌండ్ లో 962 వాహనాలకు వేలంపాటను జరిపారు. వీటిలో 959 వాహనాలను ఏపీ, తెలంగాణలకు చెందిన కొనుగోలుదారులు పాడుకున్నారని చెప్పారు. తద్వారా 66,19,000 ఆదాయం సమకూరిందన్నారు.
వేలంపాట ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేయనున్నట్లు వెల్లడించారు. వివిధ మాధ్యమాల ద్వారా యజమానులకు సమాచారం చేరవేసినప్పటికీ వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదన్నారు. ఈ క్రమంలోనే వేలంపాట నిర్వహించామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ-2 ఎన్.అశోక్ కుమార్, అడిషనల్ డీసీపీ మద్దిపాటి శ్రీనివాస్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.