సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ అన్నారు. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఆర్బీఐ నిర్వహించిన జన్ భాగీధారి 10కె రన్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్బీఐ తెలంగాణ రీజనల్ డైరెక్టర్ కె.నిఖిల మాట్లాడుతూ భారత దేశం జి-20 సదస్సులకు అధ్యక్షతను వహించడం గర్వకారణం అన్నారు. నేపథ్యాన్ని పురస్కరించుకొని ప్రజలకు ఆర్ధిక అంశాలపై అవగాహన కల్పించేందుకు 10కె రన్ చేపట్టామన్నారు. అనంతరం సీపీ ఆనంద్ మాట్లాడుతూ ప్రజలు ఆర్బీఐ నియమ నిబంధనలను పాటించే సంస్థల ద్వారానే సురక్షిత ఆర్ధిక లావాదేవీలు చేపట్టాలని సూచించారు. ఇటీవల సైబర్ మోసగాళ్ళు కొత్త మార్గాల్లో ప్రజల సొమ్ము కొల్లగొడుతున్నారని చెప్పారు. బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలను గుర్తు తెలియని వ్యక్తులతో ఫోన్ ద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా పంచుకోవద్దని స్పష్టం చేశారు.
Hyd: కొత్త మార్గాల్లో సైబర్ కేటుగాళ్లు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES