Sunday, September 8, 2024
Homeనేరాలు-ఘోరాలుHyd drugs: పచ్చళ్లు, ఎనర్జీ ఫుడ్..మధ్యలో డ్రగ్స్, రేవ్ పార్టీస్ కూడా..కృష్ణ కిషోర్ సీక్రెట్స్

Hyd drugs: పచ్చళ్లు, ఎనర్జీ ఫుడ్..మధ్యలో డ్రగ్స్, రేవ్ పార్టీస్ కూడా..కృష్ణ కిషోర్ సీక్రెట్స్

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో వ్యాపారవేత్త కృష్ణ కిషోర్ రెడ్డి స్టేట్మెంట్లు కీలక అంశాలు ఆసక్తికరంగా మారాయి. ఫ్రెండ్స్ ద్వారా డ్రగ్స్ అలవాటయిందన్న కిషోర్ రెడ్డి.. గోవా, బెంగళూరు, ముంబైకు వెళ్లినప్పుడు డ్రగ్స్ తీసుకునే వాళ్ళమని చెప్పినట్టు తెలుస్తోంది. బిజినెస్ పార్టీలలో డ్రగ్స్ నడిచిందని, ఈ అలవాటుతోటే డ్రగ్స్ peddlers తో సంబంధాలు ఏర్పడ్డాయని వెల్లడించినట్టు సమాచారం. బెంగళూరు, గోవా నుంచి డ్రగ్స్ తీసుకువచ్చే వాళ్ళతో కాంటాక్ట్స్ ఏర్పడ్డాయని, ఫార్మ్ హౌస్, పబ్బులలో ఫ్రెండ్స్ కి డ్రగ్స్ పార్టీ ఇచ్చినట్టు కిషోర్ ద్వారా వెలుగులోకి వస్తోంది. కొన్ని సందర్భాల్లో రేవ్ పార్టీలను కూడా నిర్వహించినట్టు, పార్టీలలో డీజేల కోసం మోహిత్ అగర్వాల్ కాంటాక్ట్ చేశాడని..డీజే ప్లేయర్ లతో పాటుగా డ్రగ్స్ కూడా మోహిత్ సరఫరా చేసాడని కిషోర్ చెప్పడం విశేషం. బిజినెస్ పార్టీలు రేవ్ పార్టీల కోసం డ్రగ్స్ తెప్పించేవాడినని, లగ్జరీ బస్సులో పార్సెల్ ద్వారా డ్రగ్స్ తెప్పించినట్టు ఆయన అంగీకరించినట్టు సమాచారం పొక్కుతోంది. పచ్చళ్ళు, ఎనర్జీ ఫుడ్డు మధ్యలో డ్రగ్ పెట్టి పార్సెల్ పంపించేవాళ్లని, డ్రగ్స్ ఫోటోలు, డ్రైవర్ ఫోటోలు, బస్సు నెంబరు, బస్సు ఫోటోలని వాట్సాప్ లో షేర్ చేసేవాళ్ళని ఈ దందా సాగిన విధానం కిషోర్ తేటతెల్లం చేసినట్టు స్పష్టమవుతోంది. తన దగ్గర పని చేస్తున్న సిబ్బందిని పంపించి డ్రగ్స్ తో పచ్చళ్ళు, ఎనర్జీ ఫుడ్డు డబ్బాలను తెప్పించుకున్నట్టు మోడస్ ఆపరండీని కిషోర్ చెప్పటం అధికారులకే షాక్ ఇచ్చింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News