Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలుHyd: మీర్ చౌక్ లో అగ్నిప్రమాదం

Hyd: మీర్ చౌక్ లో అగ్నిప్రమాదం

మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దారుల్ షిఫా ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. పాత టైర్ల దుకాణం పక్కనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలి మంటలు ఎగిసి పడ్డాయి. పక్కనే ఉన్న షాప్ కి మంటలు వ్యాపించడంతో టైర్లు మొత్తం కాలిపోయాయి. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి వచ్చిన ఫైర్ ఇంజన్ తో మంటలు అదుపు చేశారు. గత వారం రోజులుగా ట్రాన్స్ ఫార్మర్ నుండి ఆయిల్ లీక్ అవుతోందని ట్రాన్స్ కో అధికారులకు సమాచారం ఇచ్చిన పట్టించుకోలేదని ఫలితంగా అగ్నిప్రమాదం జరిగి తాను రోడ్డున పడ్డానని టైర్ ల వ్యాపారి ఆవేదన వ్యక్తంచేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News