Thursday, September 19, 2024
Homeనేరాలు-ఘోరాలుHyd: రెచ్చిపోతున్న గంజాయి గ్యాంగులు

Hyd: రెచ్చిపోతున్న గంజాయి గ్యాంగులు

గంజాయి మత్తులో మైనర్ బాలుడి పై దాడి చేశారు కొందరు కిరాతకులు. కిరాణా కొట్టులో కూర్చున్న బాలుడిని బలవంతంగా గుట్టల వద్దకు తీసుకొని వెళ్లిన గంజాయి గ్యాంగ్, గాంజాకు డబ్బులు ఇవ్వాలని బాలుడు సమీర్ బట్టలు విప్పి బెల్ట్, కర్రలతో దాడి‌ చేశారు. బాలుడిని ముఠా సభ్యులు తీవ్రంగా హింసించగా, దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు సమీర్. ఎలాగోలా వారి నుండి తప్పించుకొని ఇంటికి చేరుకున్న సమీర్ ను ఆసుపత్రికి తరలించారు. తనను కిరాణాకొట్టు నుండి కొంత మంది తీసుకొని వెళ్లి డబ్బులు ఇవ్వాలని విచక్షణారహితంగా కొట్టారంటూ బాలుడు చెప్పగా

- Advertisement -

మైలార్ దేవిపల్లి పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రుల ఫిర్యాదు చేశారు. అయితే.. మహ్మద్ సైఫ్, అబ్బూ, సమీర్ తో పాటు మరో ఐదుగురి పై ఫిర్యాదు చేసినా.. నీకు దిక్కు ఉన్న చోట చెప్పుకో ఇప్పటికే ఇద్దరిని హత్య చేశామంటూ బాలుడిని ఈ గ్యాంగ్ బెదిరించటం సంచలనం సృష్టిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News