Friday, November 22, 2024
Homeనేరాలు-ఘోరాలుHyd: హైదరాబాద్ లో ముంబై ముఠాలు..డ్రగ్స్, గంజాయి దందా

Hyd: హైదరాబాద్ లో ముంబై ముఠాలు..డ్రగ్స్, గంజాయి దందా

ముంబై మాఫియా నీడలు హైదరాబాద్ ను కమ్మేసే పరిస్థితులు తలెత్తుతున్నాయి. డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ లో ముంబై ముఠాలు భాగ్యనగరాన్ని కమ్మేస్తున్నాయి. ముంబై కేంద్రంగా డ్రగ్స్, గంజాయి దందాలను ఆయా ముఠాలు మన నగరంలో జోరుగా సాగిస్తున్నాయి. ఇప్పటికే డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్న హైదరాబాద్ పోలీసులు తమ యాక్షన్ ను మరింత వేగవంతం చేయనున్నట్లు ప్రకటించారు. సమస్యకు మూలకేంద్రాలుగా ఉన్న ప్రాంతాల్లో తమ ఆపరేషన్లను నిర్వహించి డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. ముంబై ముఠాలకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సీపీ సి.వి. ఆనంద్ వెల్లడించారు.

నగరంలో పోలీసుల తనిఖీలు, దూకుడు పెరగడంతో డ్రగ్స్ మాఫియాలు ముంబైను తమ కేంద్రంగా చేసుకున్నాయన్నారు. గతంలోనే అక్కడ పాతుకుపోయిన తమ మూలాల సహకారంతో దందాను కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. ముంబైను డ్రగ్స్, గంజాయి అడ్డాలుగా మార్చేశాయని అన్నారు. డ్రగ్స్ వ్యవహారంలో తాము కఠినంగా వ్యవహరిస్తున్నామని, గతంలో తమకు గోవా పోలీసులు సహకరించ లేదని చెప్పారు. ప్రస్తుతం ముంబై విషయమై మహారాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామన్నారు. వారి సహకారంతో ముంబైలో కూడా ప్రత్యేక ఆపరేషన్లను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అమ్మాయిలు, బాలికలకు డ్రగ్స్ ఇచ్చి అత్యాచారాలు చేస్తున్నారని. బాధితులను వ్యభిచార ఊబిలోకి దించుతున్నారని గుర్తించామన్నారు. డ్రగ్స్ తో పాటు హ్యుమన్ ట్రాఫికింగ్ ముఠాలు కూడా చురుకుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. త్వరలోనే టి-ల్యాబ్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు.

60లక్షల విలువ చేసే మాదక ద్రవ్యాలు.. 8 మంది అరెస్ట్
తమ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా విశాఖపట్నంలోని అరకు నుంచి ముంబైకు రూ.36లక్షలు విలువ చేసే 110కిలోల గంజాయి తరలిస్తున్న ముంబైకు చెందిన బిల్కిస్ మహ్మద్, అలియాస్ గర్ సఫుద్దీన్ రాంపూరావాలా, ముర్తుజా షేక్, లనుఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు అఫ్జల్ గంజ్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారన్నారని సీపీ ఆనంద్ తెలిపారు. అదే ముఠాకు చెందిన విశాఖపట్నం వాసి శ్రీనివాస్, మహారాష్ట్రకు చెందిన అబ్దుల్, హసీనాలు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -



సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News