కొంతమంది ట్రాన్స్ జెండర్స్ ప్రజలను వేధిస్తున్న తీరుపై సరూర్ నగర్ పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈమేరకు ట్రాన్స్ జెండర్స్ ల నాయకులు ఆర్తి, సన ఇతర ట్రాన్స్ జెండర్స్ లతో సరూర్ నగర్ ఇన్స్పెక్టర్ జానకి రెడ్డి, చైతన్య పురి ఇన్సిపెక్టర్ మధుసూదన్ సంయుక్తంగా సరూర్ నగర్ పోలీసు స్టేషన్ లో అవగాహన సమావేశం నిర్వహించారు.
సరూర్ నగర్ , చైతన్య పురి పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రాంతాలలోని ముఖ్య కూడళ్లలో , రద్దీగా ఉండే ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాలను ట్రాన్స్ జెండర్స్ వాహనదారులను నిలువుదోపిడీ చేస్తున్న తీరుపై వార్నింగ్ ఇచ్చారు. ఫంక్షన్ హాల్స్, శుభ కార్యాలయాల వద్ద , ప్రారంభోత్సవాల వద్ద గుంపులు గుంపులుగా వచ్చి , నిర్వాహకులతో పరుష పదజాలంతో మాట్లాడడం , అగౌరపరిచేలా ప్రవర్తించడం , రాత్రి పూట రోడ్లపై వచ్చిపోయే వాహనదారులను, కాలనిలలోకి వెళ్లే కాలనీ వాసులను ఇబ్బందులకు గురిచేయడం , సంతల వద్ద చిన్నతరగతి వ్యాపారులను ఇబ్బందులు పెట్టడం వంటి చర్యలు మానుకోవాలని హెచ్చరించారు.
తోటి ట్రాన్స్ జెండర్స్ లకు అవగాహన కల్పించాలని పోలీసులు హెచ్చరించారు. అనవసరంగా ట్రాన్స్ జెండర్స్ లపై ఎవరైనా దాడులకు పాల్పడితే సహించేది లేదని, దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ట్రాన్స్ జెండర్స్ కూడా సమాజంలో గౌరవంగా జీవించేందుకు పోలీసు శాఖ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.