Sunday, November 16, 2025
Homeనేరాలు-ఘోరాలుHyd: కుక్క దాడిలో గాయపడ్డ డెలివరి బాయ్ పరిస్థితి విషమం

Hyd: కుక్క దాడిలో గాయపడ్డ డెలివరి బాయ్ పరిస్థితి విషమం

స్విగ్గీ డెలివరీ బాయ్ పై కుక్క దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లోని

- Advertisement -

బంజారాహిల్స్ లోని రోడ్ నం-6లో ఉన్న లుంబినీ రాక్ క్యాజిల్ అపార్ట్మెంట్ లో స్విగ్గీ ఏజెంట్ పై కుక్క దాడి చేసింది. గత మంగళవారం రాత్రి 10గంటలకు స్విగ్గీ డెలివరీని ఇచ్చేందుకు వెళ్లిన మహ్మద్ రిజ్వాన్ పై కస్టమర్ శోభనా నాగానికి చెందిన జర్మన్ షెపర్డ్ కుక్క దాడి చేసింది. దీంతో ఆందోళనకు గురైన రిజ్వాన్ కుక్క నుంచి తప్పించుకునే క్రమంలో..పరుగులు పెడుతుండగా అతని వెంట కుక్క పడింది. దీంతో మూడో ఫ్లోర్ నుంచి కిందకు దూకేశాడు. చికిత్స కోసం రిజ్వాన్ ను నిమ్స్ కు తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad